News January 6, 2025

HYD: నూతన ఇంధన విధానాన్ని ప్రకటిస్తాం: డిప్యూటీ సీఎం 

image

పెట్టుబడులు ఆకర్షించే విధంగా జనవరి 9న నూతన ఇంధన విధానాన్ని ప్రకటించనున్నట్లు డిప్యూటీ CM భట్టి విక్రమార్క వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎనర్జీ పాలసీతో పాటు రాష్ట్రంలో రిన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన అంశాలను అధ్యయనం చేసి నూతన విధానాన్ని రూపొందించినట్లు భట్టి తెలిపారు. తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజినీర్, ఇతర పోస్టులకు ఎంపికైన 315 మంది అభ్యర్థులకు భట్టి నియామక పత్రాలు అందజేశారు.

Similar News

News November 25, 2025

GOOD NEWS.. HYDకు రూ.300 కోట్లు

image

GHMCకి ప్రభుత్వం శుభవార్త చెప్పంది. 150 డివిజన్‌లకు రూ.300 కోట్లు ప్రకటించినట్లు మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశంలో వెల్లడించారు. త్వరలో GHMC ఎలక్షన్స్ రానున్నాయని, ఈ లోపు పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. మొదట సీఎం 150 డివిజన్లకు రూ.కోటి చొప్పున విడుదల చేస్తామన్నారన్నారు. అవి సరిపోవని చెప్పడంతో మరో రూ.150కోట్లు కేటాయించారని స్పష్టంచేశారు.

FLASH: బోరబండలో నిప్పు అంటించుకున్న హిజ్రాల్లో ముగ్గురి మృతి

image

ట్రాన్స్‌జెండర్ మోనాలిసాకు వ్యతిరేకంగా ఇటీవల బోరబండ బస్టాండ్‌లో ఓ వర్గం చేపట్టిన ఆందోళన తీవ్ర విషాదంగా మారింది. ఆందోళన సమయంలో పెట్రోల్ పోసుకున్న ట్రాన్స్‌జెండర్లలో చికిత్స పొందుతూ మంగళవారం నవనీత (24) బాలానగర్‌లోని ఓ ఆస్పత్రిలో మరణించింది. ఈ నెల 20న అప్సానా, 23న హీనా కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. బోరబండ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.