News November 7, 2024
HYD: నూతన టెక్నాలజీతో లీకేజీలకు అడ్డుకట్ట..!

HYD నగర ప్రజలకు మంచి నీటి సమస్య రాకుండా జలమండలి చర్యలు చేపడుతోంది. గండిపేట కాండ్యూట్ లీకేజీలతో 8ఎంజీడీ (30 లక్షల లీటర్లు) నీరు వృథా అవుతుందని గుర్తించిన అధికారులు, గ్రౌటింగ్ పద్ధతిలో కెమికల్ ట్రీట్మెంట్ టెక్నాలజీ ఉపయోగించి నీటి సరఫరాకు అంతరాయం కలిగించకుండా మరమ్మతులు చేస్తున్నారు. ఈ లీకేజీలు దాదాపు 14.5 కిలోమీటర్ల పొడవున ఉన్నట్లు గుర్తించామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
Similar News
News October 31, 2025
జూబ్లీహిల్స్: నేటి నుంచి బీఆర్ఎస్ ‘మాట.. ముచ్చట’

జూబ్లీహిల్స్ ఎన్నికకు కేవలం 10 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ‘మాట.. ముచ్చట’ కార్యక్రమం జరుగనుంది. నియోజకవర్గంలో రద్దీ ప్రాంతాల్లో పార్టీ నాయకులు స్థానికులతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తారు. నగర అభివృద్ధిపై మాట్లాడనున్నారు.
News October 31, 2025
HYD: అజ్జూ భాయ్ చుట్టూ పొలిటికల్ డ్రామా

ఇపుడు చర్చ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంపై కాకుండా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ చుట్టూ సాగుతోంది. కారణం ఆయనకు కాంగ్రెస్ మంత్రి పదవి ఇస్తుండటం వల్లే. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అతడికి మంత్రి పదవి ఎలా ఇస్తారని బీజేపీ నాయకులు, ఆయన దేశానికి చేసిన సేవను బీజేపీ గుర్తించడం లేదని కాంగ్రెస్ నేతలు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగారు.
News October 31, 2025
మాగంటి సునీతపై బోరబండ PSలో కేసు నమోదు

బీఆర్ఎస్ గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత సామ రామ్‌మోహన్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రామ్‌కు ఫిర్యాదు చేశారు. సునితపై ఇచ్చిన ఆధారాలను గుర్తించిన రిటర్నింగ్ అధికారి బోరబండ PSలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


