News August 14, 2024

HYD: నెట్ జీరో సిటీ అంటే తెలుసా..?

image

HYD నగర శివారు కందుకూరు ప్రాంతంలో నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయనుంది. పరిశ్రమల నుంచి వెలువడే కర్బన, రసాయన సమ్మేళనాల కాలుష్యంతో ప్రజా జీవనంపై ప్రభావం పడకుండా, జాతీయ కాలుష్య ప్రమాణాలను పాటించి, జీరో కార్బన్ ఎమిషన్ సిటీగా ఏర్పాటు చేయనున్నారు. ఈ సిటీలో 33% పచ్చదనం ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. పచ్చదనంతో HYD పరిసరాల్లో ఉష్ణోగ్రత కంటే 2-3 డిగ్రీలు సెంటీగ్రేడ్లు తక్కువగా ఉండనున్నాయి.

Similar News

News November 6, 2025

HYD: TGCABలో JOBS.. నేడు లాస్ట్

image

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు నేటితో ముగుస్తుంది. HYDలో 32 స్టాఫ్ అసిస్టెంట్‌‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి.
SHARE IT

News November 6, 2025

హైటెక్స్‌లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2025

image

HYDలో నవంబర్ 25- 28 వరకు దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో జరగనుంది. వన్ నేషన్ వన్ EXPO థీమ్‌తో జరిగే ఈవెంట్‌లో 50 దేశాల నుంచి 500 ఎగ్జిబిటర్స్, 40,000 కుపైగా సందర్శకులు పాల్గొంటారు. 35,000 చదరపు మీటర్లలో తాజా పౌల్ట్రీ సాంకేతికతలు, సస్టైనబుల్ సొల్యూషన్స్ ప్రదర్శించబడతాయి. దేశ పౌల్ట్రీ రంగం రూ.1.35 లక్షల కోట్లతో ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.

News November 6, 2025

HYD: గోపి నా పెద్దకొడుకని అక్షరను హత్తుకున్న అవ్వ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు రహమాత్‌నగర్‌లోని ఫాతిమా నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో ఓ అవ్వ ‘గోపీ నా పెద్ద కొడుకు అని గుర్తు తలుచుకుంటూ.. నా మనుమరాలు అని ఆప్యాయంగా అక్షరను దగ్గరకు తీసుకొని మనస్ఫూర్తిగా దీవించారు. మాగంటి సునీత అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గంటెపాక నరేష్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.