News March 23, 2025

HYD: ‘నెట్ వర్కింగ్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

యువత నెట్ వర్కింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఏఐ డేటా ఫెస్ట్ ప్రతినిధి, ప్రముఖ పారిశ్రామిక డేటా నిపుణులు ధావల్ పటేల్ సూచించారు. ఏఐ డేటా ఫెస్ట్ ఆధ్వర్యంలో శనివారం నారాయణగూడలో విద్యార్థులకు, యువతకు నెట్ వర్కింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఐ డేటా సైన్స్ అనలిటిక్స్‌లో పురోగతులను పరిశోధించడానికి మంచి ఫ్లాట్ ఫారం లా ఇలాంటి వర్క్ షాపులు దోహద పడతాయన్నారు.

Similar News

News February 24, 2026

NRPT: విషాదం.. పెళ్లయిన మూడో రోజే వరుడు సూసైడ్

image

నారాయణపేట జిల్లా నర్వలో విషాదం చోటుచేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాలు.. ఈనెల 20న కర్నూల్ వాసి సంధ్యతో నర్వకు చెందిన రవి(25)కి వివాహం జరిగింది. ఈ క్రమంలో ఈనెల 22న రాత్రి భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వధువు బంధువులు ఇంటికి చేరుకుని వరుడి కుటుంబీకులపై దాడి చేయడంతో మనస్తాపానికి గురైన రవి సోమవారం ఉరేసుకుని చనిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News February 24, 2026

‘వాహన్’ పోర్టల్‌లోకి తెలంగాణ.. అన్నీ ఆన్‌లైన్‌లోనే!

image

TG: కేంద్రం తీసుకొచ్చిన ‘వాహన్’ పోర్టల్‌లో మార్చి 15న చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఈ పోర్టల్‌లో పొందవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొన్నా అమ్మినా ఇక నుంచి ఓనర్ పేరు, అడ్రస్ మార్పులకు RTA ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ హిస్టరీ, డూప్లికేట్ RC వంటివి ఇందులో పొందే అవకాశం ఉంటుంది.

News February 24, 2026

కదిరి యువకుడికి గుండె మార్పిడి

image

శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన చరణ్‌కుమార్‌కు బెంగళూరులోని వైదేహీ ఆసుపత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చొరవతో ఈ చికిత్స జరిగింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన యువకుడి నుంచి సేకరించిన గుండెను డా.దుర్గాప్రసాద్‌రెడ్డి బృందం చరణ్‌కు అమర్చారు. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నట్లు మంత్రి సత్యకుమార్ కార్యాలయ ప్రతినిధులు వెల్లడించారు.