News October 4, 2024

HYD: నేటి నుంచి పీసీసీ చీఫ్ జిల్లా పర్యటన

image

PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం నుంచి జిల్లా పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. ఆయన సొంత జిల్లా నిజామాబాద్ నుంచే పర్యటన ప్రారంభించనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటి నుంచి నిజామాబాద్ బయలుదేరుతారు. ఆయన వెంట ఎనిమిది మంది మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ సీనియర్ నేతలు ఉంటారని తెలిపారు.

Similar News

News December 5, 2025

HYD: ఇదేం పునర్విభజన.. మేం ఉండలేం బాబోయ్!

image

మా ప్రాంతాలను గ్రేటర్‌లో కలిపితే మాకు అనుకూలంగా ఉండాలి కాని.. ఎక్కడో దూరంగా ఉన్న సర్కిళ్లలో కలిపితే ఎలా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనంలో భాగంగా బడంగ్‌పేట, తుర్కయాంజల్, ఆదిభట్ల ప్రాంతాలు చార్మినార్ జోన్ కలిశాయి. అయితే ఆయా ప్రాంతాల వారు మాత్రం.. మేము ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉంటామని చెబుతున్నారు. అలాగే పోచారం, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంత వాసులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.

News December 5, 2025

HYD: పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?

image

గ్రేటర్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు విలీనం చేయడంతో ఇపుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అప్పుడే అసలు ఎన్ని వార్డులు వచ్చే అవకాశముందనే విషయంపై క్లారిటీ వస్తుంది.

News December 5, 2025

HYD: ‘మెట్రో’ భూములు ఏమయ్యాయి?

image

మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా అప్పటి ప్రభుత్వం మెట్రోకు 57 ఎకరాలను కేటాయించింది. మెట్రో అధికారులు మాత్రం కేవలం 18 ఎకరాలను మాత్రమే వినియోగించారు. మూసారంబాగ్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మాదాపూర్‌లో మాత్రమే మాల్స్ కట్టి మిగతా 39 ఎకరాలను వదిలేసింది. ఇపుడు ఈ స్థలాలను ఆడిటింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు ఆ భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఎందుకు వాటిని వాడుకోలేదని తెలుసుకునే పనిలో పడ్డారు.