News February 2, 2025

HYD: నేడు కాంగ్రెస్ నిరసనలు

image

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Similar News

News December 12, 2025

HYD: ITI చేశారా? జాబ్ కొట్టండి..!

image

జిల్లా ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నర్సయ్య తెలిపారు. చర్లపల్లిలో ఉన్న కంపెనీలో టెక్నికల్ ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నారన్నారు. మల్లేపల్లిలోని ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా ఉంటుందన్నారు. ఫిట్టర్, వెల్డర్‌లో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు హాజరుకావచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు.

News December 12, 2025

HYDలో కొత్త బస్సులు.. డోర్ క్లోజ్ అయితేనే కదలేది!

image

నగరంలో కొత్త బస్సులు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఆకర్షణీయంగా ఉండటంతో పాటు భద్రతా చర్యలు ఈ బస్సుల్లో ఏర్పాటు చేశారు. 65 ఎలక్ట్రిక్ బస్సులు సిటీలో దూసుకెళ్తున్నాయి. బస్సులో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్ అందుబాటులో ఉంచారు. డోర్ క్లోజ్ అయితేనే బస్సు ముందుకు వెళ్లేలా దీన్ని రూపొందించారు.

News December 12, 2025

HYDలో బయట తిరిగితే 4సిగరెట్లు కాల్చినట్లే!

image

నగరంలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 12 శాతం వాయుకాలుష్యం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ గాలి పీల్చడం వల్ల రోజుకు 4.4 సిగరెట్లు కాల్చినంత ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డిసెంబర్ నెల AQI 178గా నమోదైంది.