News February 2, 2025
HYD: నేడు కాంగ్రెస్ నిరసనలు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Similar News
News February 2, 2025
HYD: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39వ షోరూం ప్రారంభం
సంప్రదాయం, ఆధునికత మేళవింపుతో అద్భుతమైన వస్త్రాలను అందుబాటులో అందిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39వ షోరూంను మహబూబ్ నగర్ క్లాక్ టవర్‌లో శనివారం ప్రారంభించింది. నటి ఊర్వశి రౌతేలా జ్యోతి ప్రజ్వలన చేశారు. సంస్థ డైరెక్టర్లు సురేష్ సీర్ణ, అభినయ్, రాకేశ్, కేశవ్ మాట్లాడుతూ.. అందరి అభిరుచులకు అనుగుణంగా, వివాహాది శుభకార్యాల కోసం ప్రత్యేక కలెక్షన్ ఆఫర్లలో అందుబాటులో ఉన్నాయన్నారు.
News February 2, 2025
HYD: బార్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌రోడ్ నెంబర్ 36లోని పొష్ణోష్ లౌంజ్ బార్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ లైసెన్స్ ముగిసినా బార్ నడుపుతున్నారని వారు చెప్పారు. వంటల్లో గడువు ముగిసిన పెప్పర్స్, ఆయిల్ వాడుతున్నారని వాటిని సీజ్ చేసినట్లు చెప్పారు.
News February 2, 2025
చెరువుల రక్షణకై హైడ్రా కమిషనర్‌కు TDF రిపోర్ట్
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్ AV రంగనాథ్‌కు MLC ప్రొ. కోదండరాం, TDF అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి చెరువుల రక్షణకు సూచనలతో కూడిన రిపోర్టును అందచేశారు. TGలోని 46,500 చెరువులు, ముఖ్యంగా HYDతో కలుపుకొని 4 జిల్లాలలోని 1,042 చెరువులకు సంబందించిన డీటేయిల్ రిపోర్టును అందచేయగా, స్పందించిన హైడ్రా కమిషనర్ వచ్చే వారం రౌండ్ టేబుల్ సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు.