News February 2, 2025
HYD: నేడు కాంగ్రెస్ నిరసనలు

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Similar News
News December 12, 2025
కల్వకుర్తిలో 9.3 డిగ్రీలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కల్వకుర్తి మండలంలో అత్యల్పంగా 9.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్‌లో 9.6°C, బల్మూరులో 9.8°C, వెల్దండలో 10.1°C, తాడూరులో 10.2°C, తెలకపల్లిలో 10.3°C, ఊర్కొండలో 10.7°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
News December 12, 2025
IVFతో అప్పుల పాలవుతున్న జంటలు

ప్రస్తుతకాలంలో సంతానలేమి సమస్య పెరగడంతో చాలామంది IVF చికిత్స చేయించుకుంటున్నారు. అయితే దీనివల్ల 90శాతం జంటలు అప్పులపాలవుతున్నట్లు ICMR నివేదికలో వెల్లడైంది. ఈ చికిత్సను ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పరిధిలోకి తీసుకురావాలని ICMR సూచించింది. ఈ ఖర్చులను కూడా రీయింబర్స్ చేయాలని ఆ నివేదికలో సిఫార్సు చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
News December 12, 2025
మహబూబాబాద్: మాజీ ఎంపీపీ హత్య

జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గార్ల మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీగా పని చేసిన బానోతు లాలు హత్యకు గురయ్యారు. కూతురును వేధిస్తుంటే తండ్రికి ఫోన్ చేయగా లాలు వెళ్లాడు. ఇంటికి వెళ్లిన ఆయన్ను అల్లుడు, అతడి తండ్రి తీవ్రంగా గాయపరచడంతో మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


