News February 2, 2025
HYD: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. మరో 3 రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు ఉండటంతో హడావుడి జోరుగా కొనసాగుతోంది. ఢిల్లీ పీఠం దక్కించుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు కుస్తీలు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నేతలను పిలిపించుకొని ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరపున ప్రచారానికి వెళ్లి ఢిల్లీలో సీఎం ప్రచారం చేయనున్నారు.
Similar News
News November 1, 2025
HYD: ‘రంగనాథ్ సార్.. పాఠశాలకు వెళ్లలేకపోతున్నాం’

HYD శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ ఔటర్ రింగురోడ్డు అండర్ పాస్‌లు వరద నీటిలో మునుగుతున్నాయని విద్యార్థినులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సులో తాము స్కూల్‌కు వెళ్తామని.. ఇటీవల తాము ప్రయాణిస్తున్న బస్సు అండర్‌పాస్ కింద నీటిలో ఆగిపోవడంతో ఇబ్బంది పడ్డామని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
News November 1, 2025
BREAKING: HYD: ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై మహిళపై అత్యాచారం

HYD అమీర్‌పేట్ పరిధిలో ఈరోజు దారుణం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై GHMC పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం జరిగింది. బాధితురాలు ఏడుస్తూ బోరబండ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
News November 1, 2025
HYD: మోజు తీరిన తర్వాత ముఖం చాటేశాడు!

మహిళను ఓ యువకుడు మోసం చేయగా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూర్యాపేటకు చెందిన డిగ్రీ విద్యార్థి రమేశ్(20)కు 2022లో బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో నివసించే ఓ మహిళ(32) ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆమెకు ఒక కూతురు ఉండగా భర్త చనిపోయాడు. ఈవిషయాన్ని ఆమె రమేశ్‌కు చెప్పింది. దీంతో తాను పెళ్లి చేసుకుని, తల్లీబిడ్డను బాగా చూసుకుంటానని నమ్మించాడు. మోజు తీరిన తర్వాత ముఖం చాటేయగా ఆమె PSలో ఫిర్యాదు చేసింది.


