News October 14, 2024
HYD: నేడు ప్రొఫెసర్ సాయిబాబా అంతిమయాత్ర
అనారోగ్యంతో మృతిచెందిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొ.సాయిబాబా పార్థివదేహాన్ని నేడు నిమ్స్ ఆస్పత్రి నుంచి తీసుకొని గన్ పార్క్ చేరుకుంటారు. అక్కడ కాసేపు ఉంచి అనంతరం మౌలాలిలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్తారు. మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఉంచి 3 గంటలకు ఇంటి నుంచి అంతిమయాత్ర బయలుదేరుతుందని, పరిశోధనల నిమిత్తం పార్థివదేహాన్ని గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగిస్తామని కుటుంబ సభ్యులు, ఉద్యమ సహచరులు తెలిపారు.
Similar News
News November 5, 2024
HYD: ప్రజలు అన్నీ తెలుసుకుంటున్నారు
హైదరాబాదులో ఇప్పుడు ఇల్లు, స్థలం కొనుగోలు చేసేవారు అన్ని జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేస్తున్నారని పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్‌తో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వ శాఖలన్నీ సహకరించినప్పుడే హైడ్రా సత్ఫలితాలు ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. FTL, బఫర్ జోన్, క్యాచ్‌మెంట్ ఏరియా అంటే ఏమిటో ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు.
News November 5, 2024
HYD: మతోన్మాదానికి వ్యతిరేకంగా సదస్సులు
HYDలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలోని ఎంబీ భవన్‌లో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, అభ్యుదయ వాదులతో సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని తీర్మానించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ నెల 15 నుంచి నెల రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని, బీజేపీ, RSS దేశంలో మతోన్మాదంతో విధ్వంసానికి పాల్పడుతున్నాయని పేర్కొన్నారు.
News November 5, 2024
HYD: ALERT ట్రాఫిక్ పోలీసులు చూస్తున్నారు
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. బైక్ నడిపే వారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. దీనికి నేటి నుంచి స్పెషల్‌డ్రైవ్ నిర్వహించనున్నారు. 3 రోజులుగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారని, ఇందుకు హెల్మెట్ లేకపోవడమే కారణమని సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వ ప్రసాద్ తెలిపారు. హెల్మెట్ లేకపోతే రూ.200, రాంగ్ రూట్లో వెళితే రూ.2వేలు చలానా విధిస్తామన్నారు.