News April 12, 2025

HYD: నేడు మద్యం దుకాణాలు బంద్

image

హనుమాన్ జయంతి సందర్భంగా జంట నగరాలు.. HYD, సికింద్రాబాద్‌లో మద్యం దుకాణాలను మూసేయాలని పోలీసు శాఖ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్లు కాంపౌండ్లు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే బార్లను బంద్ చేయాలని సూచించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Similar News

News January 8, 2026

తలకొండపల్లి: రేపటి నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

image

తలకొండపల్లి మండలం వెల్జాల్‌లో వెలసిన వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త శ్రీనివాసమూర్తి చెప్పారు. ఉత్సవాలలో భాగంగా 9న గణపతి పూజ, లక్ష్మీనరసింహస్వామి అభిషేకం, లక్ష పుష్పార్చన, 10న పుష్పార్చన, అభిషేకం, బండ్లు తిరుగుట, 11న మధ్యాహ్నం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం, చక్రతీర్థం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News January 8, 2026

రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్-2 మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్

image

నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమిని కాజేయాలనుకున్న వ్యక్తులకు సహకరించిన రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2 కె.మధుసూధన్ రెడ్డిని రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సస్పెండ్ చేశారు. అంతే కాదు.. మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

News January 6, 2026

రంగారెడ్డిలో ‘పేదోడి విందు’ కొండెక్కింది

image

పేదోడి విందైన చికెన్ ధర కొండెక్కడంతో RRజిల్లాలో చికెన్ ప్రియులకు షాక్ తగిలి బెంబేలు ఎత్తుతున్నారు. న్యూ ఇయర్ ప్రారంభంలోనే కిలో చికెన్ ధర త్రిబుల్ సెంచరీకి చేరింది. గత కొన్ని రోజులుగా రూ.200- 250 ఉన్న ధర అమాంతం పెరగడంతో వచ్చే పండుగ ఎలా చేసుకోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఫారం ధర రూ.180 పలుకుతోంది. వినియోగం పెరిగి, కోళ్ల పెంపకం తగ్గడమే ధర పెరగుదలకు కారణమని ఫారం యజమానులు చెబుతున్నారు.