News April 12, 2025
HYD: నేడు మద్యం దుకాణాలు బంద్

హనుమాన్ జయంతి సందర్భంగా జంట నగరాలు.. HYD, సికింద్రాబాద్‌లో మద్యం దుకాణాలను మూసేయాలని పోలీసు శాఖ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్లు కాంపౌండ్లు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే బార్లను బంద్ చేయాలని సూచించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Similar News
News September 18, 2025
ADB: ఇక పల్లె రహదారులపై రయ్ రయ్..!

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని జిల్లా కేంద్రాల నుంచి వివిధ ప్రాంతాలకు రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరచడం కోసం భారీగా నిధులు మంజూరయ్యాయి. మొదటి దశలో భాగంగా పలు రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 30 రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.659.97 కోట్లకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా కేంద్రానికి అనుసంధానం కాని గ్రామాలు, మండలాలను కలుపుతూ కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, మరమ్మతులు చేపట్టనున్నారు.
News September 18, 2025
అరాచకమే.. సందీప్ వంగాతో మహేశ్ మూవీ?

రాజమౌళితో సినిమా తర్వాత మహేశ్ బాబు చేసే మూవీ విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీని కోసం మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మూవీ చేయాలని మహేశ్‌ను సునీల్ కోరినట్లు తెలిపాయి. కాల్షీట్ల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నాయి. దీంతో సందీప్, మహేశ్ కాంబినేషన్ కుదిరితే అరాచకమేనని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News September 18, 2025
పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.