News January 30, 2025

HYD: నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు

image

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి నేటితో కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజులు పూర్తి చేసుకుంటుంది. 420 రోజులు అవుతున్నా, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. నేడు గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలిచ్చి నిరసన తెలపాలని బీఆర్ఎస్ పిలుపు నిచ్చారు.

Similar News

News October 24, 2025

ఓయూలో వాయిదా పడిన కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఓయూ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎమ్మెస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ నాలుగో సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

News October 24, 2025

HYD: సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

image

సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం ₹12.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. హైదరాబాద్‌లో ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరిట వందల మందిని సాహితీ ఇన్ఫ్రా సంస్థ మోసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. డైరెక్టర్ పూర్ణచందరరావు, కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మొత్తం ₹126 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ విచారణలో తేలింది.

News October 24, 2025

పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ ఫలితాల విడుదల

image

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్) తదితర కోర్సుల 2000-19 మధ్య బ్యాచ్‌ల విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఫలితాలు సిద్ధంగా ఉన్నాయని, విద్యార్థులు తమ మార్కు మెమోలను ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచిలోని పీజీ సెక్షన్ (రూం నంబర్.13) నుంచి తీసుకోవచ్చని సూచించారు.