News January 30, 2025
HYD: నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి నేటితో కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజులు పూర్తి చేసుకుంటుంది. 420 రోజులు అవుతున్నా, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. నేడు గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలిచ్చి నిరసన తెలపాలని బీఆర్ఎస్ పిలుపు నిచ్చారు.
Similar News
News February 6, 2025
HYD: రేవంత్ చిత్రపటాలు తగలబెట్టాలి: రామచంద్రరావు

కామారెడ్డి డిక్లరేషన్‌కు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానానికి చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారా? అంటూ కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషను విలువలేకపోతే రేవంత్ దాన్ని తగులబెట్టి బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా అంటూ డిమాండ్ చేశారు.
News February 6, 2025
కేశంపేట: శివస్వాములకు ముస్లిం సోదరుల అన్నదానం

HYD శివారు షాద్‌నగర్ సమీపంలోని కేశంపేట మండలంలోని వేములనర్వ శివాలయంలో శివ స్వాములకు ఎండీ మహమ్మద్ ఆధర్యంలో ముస్లిం సోదరులు అన్నదానం చేశారు. మతసామరస్యం చాటుకున్న సల్వార్, ఆఫీజ్, జహంగీర్‌బాబా, ఇమ్రాన్‌కు శివస్వాములు శ్రీకాంత్, గణేశ్, మహేశ్, భిక్షపతి, అశోక్, బాలరాజు, రాఘవేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
News February 6, 2025
పెద్దఅంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

పెద్దఅంబర్‌పేట్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో రిత్విక LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పసిపాప బస్సు కింద పడి నలిగిపోయిందని వారు వాపోయారు.