News May 25, 2024
HYD: నేడు, రేపు రైళ్లు రద్దు!

నేడు, రేపు పలు MMTS, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి(FOB)ల నిర్మాణం నేపథ్యంలో సికింద్రాబాద్-ఫలక్నుమా, మేడ్చల్- సికింద్రాబాద్, లింగంపల్లి-మేడ్చల్, హైదరాబాద్- మేడ్చల్ మధ్య సేవలందించే 22 MMTS సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్ పీఆర్వో సీహెచ్.రాకేశ్ తెలిపారు. SHARE IT
Similar News
News December 7, 2025
HYD: జుట్టు ఊడుతోందా? మీకోసమే!

నగరవాసులకు ఒత్తైన జుట్టు కలగా మారుతోంది. మనోళ్లని హెయిర్లాస్, చుండ్రు తీవ్రంగా వేధిస్తున్నాయి. 30ఏళ్లలోపు 60% మందికి బాల్డ్హెడ్, 30% మందికి జట్టురాలుతోందని ఓ సర్వే వెల్లడించింది. ఒత్తిడి, హార్డ్ వాటర్కు VIT-D, VIT-B12 లోపాలు తోడవుతున్నాయి. VIT-D కణాలు ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది. ఎండతగలకుండా ఉదయాన్నే ఆఫీస్కు చేరుకునేవారిలో VIT-D లోపం, మూడ్ స్వింగ్స్, బరువుపెరుగుదల ఉంటాయని వివరించింది.
News December 7, 2025
వామ్మో! HYDలో భారీగా పెరిగిన ధరలు

నగరంలో గుడ్ల ధరలు కొండెక్కాయి. విడిగా కొంటే గుడ్డు రూ.8- 9 వరకు అమ్ముతున్నారు. డజన్ రూ.90కి, ట్రే 220- 230 వరకు విక్రయిస్తున్నారు. ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్లో ఎగ్ డీలర్స్ వద్ద స్టాక్ లేకపోవడం ధరల ఎఫెక్ట్ కనిపిస్తోంది. వర్కవుట్స్ చేసే వారికి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోటీన్ సోర్స్ గుడ్డే..త్వరగా కర్రీ చేసుకునే బ్యాచిలర్లు ఇబ్బందిగానే మారిందంటున్నారు. 3వారాలుగా గుడ్ల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
News December 7, 2025
నగరంలో NAVY బ్యాండ్ షో.. ఫ్రీ ఎంట్రీ

ఇండియన్ నేవీ డే ఉత్సవాల్లో భాగంగా NAVY సాగర శక్తిని చాటిచెప్పే సంగీత విభావరి హైదరాబాద్లో జరగనుంది. తూర్పు నౌకాదళ కమాండ్ (విశాఖపట్నం) నుంచి వచ్చిన 26 మంది సభ్యుల నేవీ బ్యాండ్, డిసెంబర్ 8న సా.6 గంటలకు కొండాపూర్లోని సరత్ సిటీ మాల్లో గంట పాటు సంగీత ప్రదర్శన ఇవ్వనుంది. 1971 యుద్ధ విజయ స్ఫూర్తిని గుర్తుచేస్తారు. ఈ ఉచిత కార్యక్రమానికి ప్రజలందరూ ఆహ్వానితులే.


