News April 11, 2024

HYD: నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు

image

ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండగను పురస్కరించుకొని నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మ్యూజియం మూసి ఉంటుందని పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.

Similar News

News February 11, 2026

3pm రంగారెడ్డి అప్‌డేట్.. దూసుకొచ్చిన ఆమన్‌గల్

image

RR మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 2 తర్వాత ఓటర్లు కేంద్రాలకు కదిలారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మ.3గం. వరకు జిల్లాలో 68.77% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆమనగల్లులో 76.33%, చేవెళ్ల 73.04% ఇబ్రహీంపట్నం 68.6%, మొయినాబాద్ 69.79, శంకర్‌పల్లి 65.19, షాద్‌నగర్‌లో 65.25% నమోదైంది. పోలింగ్‌కు మరో 1:10 గం. సమయం మిగిలి ఉంది.

News February 11, 2026

RR: 57.68%తో చేవెళ్ల టాప్.. మొత్తం ఎంతంటే!

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కాస్త ఊపందుకుంది. 12 తర్వాత ఓటు వేసేందుకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లాలో 52.57% పోలింగ్ నమోదైంది. ఆమనగల్లు 54.4%, చేవెళ్ల 57.68,% ఇబ్రహీంపట్నం 52.73%, మొయినాబాద్ 49.67, శంకర్‌పల్లి 49.63, షాద్‌నగర్ 52.43% నమోదైంది.

News February 11, 2026

రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల టాప్

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల వ్యాప్తంగా ఉ.11గం. వరకు మొత్తం 30.11% పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 31.06%, ఆమనగల్లులో 25.58, చేవెళ్లలో 34.02, మెయినాబాద్‌లో 26.97, శంకర్‌పల్లిలో 32.05, షాద్‌నగర్‌లో 32.5% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. యువత ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజాసామ్య స్ఫూర్తిని చాటాలని సూచించారు. ఇప్పటివరకు చేవెళ్లలో ఇప్పటి వరకు అత్యధికంగా ఓటింగ్ నమోదైంది.