News April 11, 2024
HYD: నేడే రంజాన్.. సర్వం సిద్ధం

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్(ఈద్-ఉల్-ఫితర్)ను నేడు జరుపుకోవాలని రుహియ్యతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) సభ్యులు తెలిపారు. బుధవారం రంజాన్ చివరి రోజుగా పరిగణించి ఉపవాసం పాటించారు. గురువారం షవ్వాల్ 1వ తేదీ (ఏప్రిల్ 11)గా పరిగణించి పండుగ జరుపుకోవాలని సూచించారు. మక్కా మసీద్, మల్లేపల్లి మసీద్, తాండూరు మసీద్, HYD, RRలోని తదితర ఈద్గా మైదానాల్లో ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేశారు.
Similar News
News March 17, 2025
HYDలో ఔరంగజేబు వెనక్కి తగ్గాడు

‘ఛావా’ చూసిన అందరికీ ఔరంగ జేబు క్రూరత్వం తెలిసే ఉంటుంది. 17వ శతాబ్దంలో ఆయన HYD వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. గోల్కొండ కోట ఆక్రమించుకుని హిందూ దేవాలయాలు ధ్వంసం చేయాలని HYD వచ్చాడు. ఇక్కడ ధ్యానాంజనేయ ఆలయంలో ఓ శబ్దం విన్నాడు. ‘హే రాజన్ మందిర్ తోడ్నా హైతో పెహ్లే తుమ్ కరో మన ఘట్’ అనే రామదూత స్వరం విని వెనక్కి తగ్గాడని, అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని కర్మన్‌ఘాట్‌గా పిలుస్తున్నారని స్థల పురాణం చెబుతోంది.
News March 17, 2025
HYD: ఓయూ బంద్‌కు ABVP పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు ఇక మీదట అనుమతి లేదని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది నియంతృత్వ పోకడ అంటూ ABVP మండిపడుతోంది. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీ బంద్‌కు నాయకులు పిలుపునిచ్చారు. రిక్రూట్‌మెంట్, నిధుల కొరత, ఆహార నాణ్యత అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారనే నెపంతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.
News March 16, 2025
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్.. 315 మంది చిక్కారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 315 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 233 ద్విచక్ర వాహనాలు, 5 త్రిచక్ర వాహనాలు, 71 నాలుగు చక్రాల వాహనాలు, 6 హెవీ వెహికిల్ వాహనాలు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడ్డ వారందరినీ కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు.