News November 25, 2024
HYD: నేడే రవీంద్రభారతిలో బీసీల రణభేరి: ఆర్.కృష్ణయ్య

BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య 18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ నేడు రవీంద్రబారతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజకీయ పార్టీల నాయకులను ఈ సభకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం, పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, అసెంబ్లీలో 50% రిజర్వేషన్ల అమలు, కేంద్ర జనగణనలో కులగణన వంటివి తమ డిమాండ్లలో ఉన్నాయని తెలిపారు. బీసీలందరం ఏకమవుదాం అన్నారు.
Similar News
News October 21, 2025
అంబర్పేట్లో బాణసంచా వివాదం.. పది మందిపై కేసు నమోదు

HYD అంబర్పేట్లో బాణసంచా వివాదం ఘర్షణగా మారింది. దీపావళి వేళ రాత్రి 11:30 గంటల సమయంలో సుధా పార్టీ నివాసం వద్ద పది మంది గుర్తుతెలియని వ్యక్తులు బాణసంచా పేల్చుతూ శబ్ద కాలుష్యం సృష్టించారు. వారికి స్థానిక మహిళ నిర్మల అడ్డు చెప్పగా ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారు. ఈ మేరకు బాధితురాలు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
News October 21, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో డబుల్ సెంచరీ దాటనున్న నామినేషన్స్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల హీట్ పెరుగుతోంది. అంచనాలను మించి అభ్యర్థుల రద్దీ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు షేక్పేట్ తహశీల్దార్ కార్యాలయంలో టోకెన్లు తీసుకున్న వారి వద్ద నుంచి RO నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగనుండగా నామినేషన్లు డబుల్ సెంచరీ దాటే సూచనలు కనిపిస్తున్నాయి.
News October 21, 2025
జూబ్లీహిల్స్లో పోటెత్తిన నామినేషన్లు..!

HYDజూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా క్యూలో 100కు పైగా నామినేషన్ల సెట్లు ఉన్నాయి. ఈరోజు సా.6.30 వరకు మొత్తం 80 దాఖలయ్యాయి. సా.3లోపు ఆర్వో ఆఫీస్ లోపలికి వెళ్లిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఒక్కో నామినేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తుండడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.ఈరోజు చివరి తేదీ కావడంతో అభ్యర్థులు పోటెత్తారు.