News November 25, 2024

HYD: నేడే రవీంద్రభారతిలో బీసీల రణభేరి: ఆర్.కృష్ణయ్య

image

BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య 18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ నేడు రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అన్ని పార్టీల నాయకులను ఈ సభకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం, పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, అసెంబ్లీలో 50% రిజర్వేషన్ల అమలు, కేంద్ర జనగణనలో కులగణన వంటివి తమ డిమాండ్లలో ఉన్నాయని తెలిపారు. బీసీలందరం ఏకమవుదాం అన్నారు.

Similar News

News December 6, 2024

మేడ్చల్: అవినీతి నిర్మూలనపై వ్యాసరచన పోటీలు

image

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ ఇందుస్ యూనివర్సల్ పాఠశాలలో అవినీతి నిర్మూలనపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని, వారి ప్రతిభను కనబరిచారు. అవినీతి అనేది ఆర్థిక వ్యవస్థను, పాలన వ్యవస్థను చింద్రం చేస్తుందని అన్నారు. ఎవరైనా లంచం అడిగితే 1064కు కాల్ చేయాలన్నారు.

News December 6, 2024

HYD: డా.బి.ఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించిన కేటీఆర్

image

భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. దేశం కోసం ఆయన ఎనలేని త్యాగాలు చేశారని, ఆయన ఆశయ సాధనతో ముందుకు వెళ్తామన్నారు.

News December 6, 2024

HYD: యూనివర్సిటీల అభివృద్ధిపై ఫోకస్

image

HYD యూనివర్సిటీల అభివృద్ధిపై విద్యా కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మౌలిక వసతుల కల్పన, ఖాళీల భర్తీ, పరిశోధనలు, అభివృద్ధి, ఆచార్యులు, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, ప్రభుత్వ బకాయిలను గుర్తించడంపై పంచసూత్ర ప్రణాళిక రూపొందించింది. ఉస్మానియా, జేఎన్టీయూ లాంటి అనేక యూనివర్సిటీలను అభివృద్ధి చేయనున్నారు.