News December 20, 2024
HYD: నేను ఏ తప్పు చేయలేదు: KTR
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734629659446_705-normal-WIFI.webp)
ఫార్మా ఈ రేసింగ్‌లో తాను ఏ తప్పు చేయలేదని KTR అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. కేవలం హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్ను పెంచేందుకే రేసింగ్ నిర్వహించామని స్పష్టం చేశారు. EVని నగరానికి రప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో కుంభకోణం ఏమీ లేదన్నారు. పైగా HYDకు రూ. వందల కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. GHMCకి ప్రచారం, ఆదాయం సమకూరినట్లు KTR వెల్లడించారు. మీ కామెంట్?
Similar News
News January 24, 2025
HYD: రూ.50వేలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన సీఐ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737717426346_50531113-normal-WIFI.webp)
లంచం డబ్బులు తీసుకుంటూ HYDలోని షాహినాయత్‌గంజ్ సీఐ బాలు చౌహన్ ఏసీబీకి చిక్కాడు. మిస్సింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు రూ.1,50,000 లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. డిమాండ్ చేసిన డబ్బులో రూ.50వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేశారు. ఆయన కార్యాలయం, ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.
News January 24, 2025
HYD: ఇన్‌స్టాలో అశ్లీల వీడియోలు.. ARREST
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737691993758_705-normal-WIFI.webp)
ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చిన్నారుల అశ్లీల నృత్యాలు షేర్ చేసిన HYD వాసులు అరెస్ట్ అయ్యారు. ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, ఓ వ్యాపారి పోర్న్ చూస్తున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. గుర్తించిన NCMEC(National Center for Missing & Exploited Children) సైబర్ క్రైమ్ PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు.
News January 24, 2025
హైదరాబాద్‌లో చికెన్ ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737681668433_705-normal-WIFI.webp)
హైదరాబాద్‌లో చికెన్ ధరలు కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. స్కిన్లెస్ రూ. 245 నుంచి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 215 నుంచి రూ. 230 మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఫాంరేట్ KG రూ. 127, రిటైల్ KG రూ. 149గా నిర్ణయించారు. మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి.
SHARE IT