News September 21, 2024
HYD: నేపాల్ వాళ్లకు సైతం ఇక్కడే ట్రైనింగ్!

రాజేంద్రనగర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో IPS అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ప్రోగ్రాంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్టేట్ హోం అఫైర్స్ కేంద్రమంత్రి నిత్యానందతో పాల్గొన్నారు. తామిద్దరం 16వ లోక్ సభలో సహచరులుగా ఉండటం ఇదే మొదటిసారి అని తెలిపారు. నేపాల్, భూటాన్ ప్రాంతానికి చెందిన వారు సైతం ఇక్కడే ట్రైనింగ్ పొందినట్లు ఎంపీ పేర్కొన్నారు.
Similar News
News March 8, 2025
హైదరాబాద్ అమ్మాయి.. నీ ప్రతిభకు సలాం

HYD పేరు నిలబెడుతోందీ ఈ సింగర్. ఆధ్యాత్మిక పాటలతో సంగీత ప్రియులను కట్టిపడేస్తూ దేశ, విదేశాల్లో 650 పైగా కల్చరల్ ఈవెంట్లలో పాల్గొంది. 9 ఏళ్ల వయసులోనే తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్లో 17 కీర్తనలతో అల్బమ్ విడుదల చేసింది. తన ప్రతిభతో ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో పేరుతెచ్చుకుంది. బర్కత్‌పురాలో ఉండే వివేక్ ఆనంద్, సుచిత్ర దంపతుల కుమార్తెనే ఈ మాళవిక ఆనంద్. ఓ మగువా నీ ప్రతిభకు సలాం.
HAPPY WOMEN’S DAY
News March 7, 2025
HYD: BRS లీడర్ ఇంట్లో విషాదం!

HYD శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కనిష్క్ రెడ్డి(19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. HYD శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్పై లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కనిష్క్ మలక్‌పేట యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కనిష్క్ మూసారాంబాగ్ BRS మాజీ కార్పొరేటర్ తీగల సునరిత, అజిత్ రెడ్డి కుమారుడు.
News March 7, 2025
HYD: కొత్వాల్‌గూడలో ఎకో పార్క్

కొత్వాల్‌గూడలో ఎకో పార్క్ 6 ఎకరాల్లో సాహస క్రీడలతో ప్రత్యేక జోన్ 6 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి HMDA ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ORR పరిధిలోని హిమాయత్‌సాగర్ పక్కన 85 ఎకరాల్లో HMDA ఎకో పార్క్ అభివృద్ధి చేస్తోంది. దేశవిదేశాల నుంచి దాదాపు 1,500 రకాల పక్షులను సేకరించి ఇక్కడి వాతావరణానికి అలవాటు చేస్తున్నారు. ఈ అడ్వెంచర్ జోన్‌కు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.