News June 5, 2024

HYD: నోటాకు ఎన్ని ఓట్లంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. మల్కాజిగిరిలో అత్యధికంగా 13,206 ఓట్లు పోలవగా హైదరాబాద్‌లో అత్యల్పంగా 2,906 ఓట్లు పోలయ్యాయి. ఇక చేవెళ్లలో 6,308 ఓట్లు, సికింద్రాబాద్‌లో 5,166 ఓట్లు వచ్చాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?

Similar News

News September 22, 2024

HYDలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు: కమిషనర్

image

గణేశ్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్ కమిషన్లు, అడిషనల్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు నగరంలోని వీధుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

News September 22, 2024

RRR సౌత్ అలైన్‌మెంట్ ఖరారుకు ప్రత్యేక కమిటీ

image

HYD శివారులో RRR దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ ఖరారు చేసేందుకు 12 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. RR, VKB జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలు భాగంగా ఉంటారు. వీరితో పాటుగా ఇతర జిల్లాల కలెక్టర్లు, R&B, NHAI అధికారుల బృందం కలిసి విస్తృతంగా అధ్యయనం చేపట్టనుంది.

News September 21, 2024

నగరవాసులకు GHMC కమిషనర్ కీలక విజ్ఞప్తి

image

నగరవాసులకు GHMC కీలక విజ్ఞప్తి చేసింది. ‘నగరం అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇంట్లోనే ఉండండి. అనవసర ప్రయాణాన్ని మానుకోండి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, నూతన నిర్మాణాలు, శిథిలావస్థ భవనాలకు దూరంగా ఉండండి. వరదల్లో రోడ్డు దాటే సాహసం చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో 040 21111111నంబర్‌ను సంప్రదించండి. అహోరాత్రులు సేవలు అందించేందుకు మేము అప్రమత్తంగా ఉన్నాం’ అని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు.