News June 5, 2024
HYD: నోటాకు ఎన్ని ఓట్లంటే?
లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. మల్కాజిగిరిలో అత్యధికంగా 13,206 ఓట్లు పోలవగా హైదరాబాద్‌లో అత్యల్పంగా 2,906 ఓట్లు పోలయ్యాయి. ఇక చేవెళ్లలో 6,308 ఓట్లు, సికింద్రాబాద్‌లో 5,166 ఓట్లు వచ్చాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 12, 2024
వికారాబాద్‌లో హైటెన్షన్!
వికారాబాద్ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారిపై దాడిని వ్యతిరేకిస్తూ ఓ వైపు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లగచర్లలో పోలీసులు భారీగా మోహరించారు. దాడి వెనుక BRS హస్తం ఉందని HYD వేదికగా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ తరుణంలో గ్రామస్థుల అరెస్ట్‌లకు నిరసనగా BRS నేతలు వికారాబాద్ బయల్దేరారు. ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
News November 12, 2024
హైదరాబాద్‌కు భగత్ సింగ్ మేనల్లుడి రాక
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ మేనల్లుడు ప్రొ. జగ్మోహన్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 26న హిమాయత్‌నగర్, 27 న కుత్బుల్లాపూర్‌లో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారని AISF, AIYF, CPI ప్రకటించాయి. భగత్‌సింగ్ ఆశయాలను కొనసాగిస్తున్న ప్రొ. జగ్మోహన్ సింగ్ మేధావులు, విద్యార్థులు, యువత, ఉద్యమకారులతో ఇంట్రాక్ట్ అవుతారని తెలిపారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని MLA కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
News November 12, 2024
HYD: వానరానికీ శివుడే దేవుడు!
కార్తీకమాస సోమవారం కీసరగుట్టలో ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. శిరసా నమామి అంటూ ఓ వానరం శివయ్యను హత్తుకుంది. కీసరగుట్టలోని శివలింగానికి భక్తులు పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన వానరాలు శివలింగం చుట్టూ ఆటలాడాయి. నైవేద్యంగా పెట్టిన అరటి పండు తిన్న ఓ వానరం ఆకలి తీర్చావయ్యా అని అనుకుందేమో..! నువ్వే నాకు దిక్కు అంటూ లింగాన్ని నమస్కరించింది.