News February 20, 2025

HYD: నోరూరిస్తున్న తిరొక్క రకాల మామిడి పండ్లు

image

వేసవి వేళ HYD నగరానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తీరొక్క రకాల మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. HYD శివారులోని బాటసింగారం మార్కెట్లో కొనుగోలు జోరందుకోగా కొత్తపేట, నాగోల్, ఉప్పల్ ప్రాంతాల్లో అనార్కలీ, జాఫ్రాన్, ఫరేబి, కోకోనట్‌లైన్, తోతాపూరి, లంగడా సేఫేది లాంటి రకాల మామిడి పండ్లను వ్యాపారులు విక్రయిస్తున్నారు. వేసవి అంటేనే మామిడి పండ్లు కాగా..రకాన్ని బట్టి రూ.80 నుంచి రూ.120కిలో అమ్ముతున్నారు.

Similar News

News November 8, 2025

అశ్వని కురిస్తే అంతా నష్టం

image

అశ్వని కార్తె వేసవి ప్రారంభంలో(ఏప్రిల్-13/14) నుంచి వస్తుంది. ఈ సమయంలో వర్షాలు పడితే, దాని ప్రభావం తర్వాత ముఖ్యమైన వర్షాధార కార్తెలైన భరణి, కృత్తిక, రోహిణిపై పడుతుందని, ఫలితంగా వర్షాలు సరిగ్గా కురవవని నమ్ముతారు. దీని వల్ల వ్యవసాయ పనులకు ఆటకం కలిగి పంట దిగుబడి తగ్గుతుందని, అన్నదాతలకు నష్టం వాటిల్లుతుందని ఈ సామెత వివరిస్తుంది.

News November 8, 2025

సంకటహర గణపతి ఎలా ఉంటాడంటే..?

image

ముద్గల పురాణం ప్రకారం.. విఘ్నేశ్వరుడికి మొత్తం 32 దివ్య స్వరూపాలున్నాయి. అందులో చివరిది, విశిష్టమైనది సంకటహర గణపతి. ఈ స్వామి రూపం ప్రశాంతంగా ఉంటుంది. కుడి చేయి వరద హస్త భంగిమలో, ఎడమ చేతిలో పాయస పాత్రతో, దేవేరిని ప్రేమగా ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని కన్పిస్తారు. కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టమట. ఈ రోజున భక్తితో ఆయన వ్రతం చేస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News November 8, 2025

సంజాపూర్‌ హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్

image

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సంజాపూర్ గ్రామంలో హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ నాగార్జున శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన జంగయ్య, అతని భార్య అలివేల, కొడుకు రమేష్‌పై ఆరుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.