News February 20, 2025

HYD: నోరూరిస్తున్న తిరొక్క రకాల మామిడి పండ్లు

image

వేసవి వేళ HYD నగరానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తీరొక్క రకాల మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. HYD శివారులోని బాటసింగారం మార్కెట్లో కొనుగోలు జోరందుకోగా కొత్తపేట, నాగోల్, ఉప్పల్ ప్రాంతాల్లో అనార్కలీ, జాఫ్రాన్, ఫరేబి, కోకోనట్‌లైన్, తోతాపూరి, లంగడా సేఫేది లాంటి రకాల మామిడి పండ్లను వ్యాపారులు విక్రయిస్తున్నారు. వేసవి అంటేనే మామిడి పండ్లు కాగా..రకాన్ని బట్టి రూ.80 నుంచి రూ.120కిలో అమ్ముతున్నారు.

Similar News

News March 24, 2025

వనపర్తి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..

image

వనపర్తి జిల్లాలో ఆదివారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. అత్యధికంగా పెబ్బేరులో 39.8℃ఉష్ణోగ్రత నమోదైంది. కొత్తకొండలో 38.6℃, విలియంకొండ 38.5, శ్రీరంగాపూర్ 38.1, పెద్దమందడి 37.6,వనపర్తి 37.5, అమరచింత 37.4, గోపాల్‌పేట 37.2, కేతేపల్లి 37.1, మదనాపూర్ 37, ఆత్మకూర్ 36.9, దగడ 36.6,ఘనపూర్ 36.5, రేమద్దుల 36.5, రేవల్లి 36.3, వీపనగండ్ల 36.2, సోలిపూర్, వెల్గొండ 36.1, పాన్గల్‌లో 35.6℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 24, 2025

జియ్యమ్మవలస: ఏనుగుల గుంపు సంచారం

image

జియ్యమ్మవలస మండలంలోని ఎరుకుల పేట గ్రామ పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం చెరుకు, అరటి తోటల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉంటూ ప్రయాణం చేయాలన్నారు. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

News March 24, 2025

జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు పడుతుందా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!