News August 19, 2024
HYD: ‘నో ఎంట్రీ’లో భారీ వాహనాలను అనుమతించొద్దు

హబ్సిగూడలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన బాలికతో పాటు గాయపడిన ఆటోడ్రైవర్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బాబు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నో ఎంట్రీ సమయంలో భారీ వాహనాలు నగరంలోకి అనుమతించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
Similar News
News December 24, 2025
చిక్కడపల్లిలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ అమ్మిన యువతి అరెస్ట్

చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టును పోలీసులు బయటపెట్టారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుష్మిత తన బాయ్‌ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి MDMA డ్రగ్స్, LSD బాటిల్స్, ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది.
News December 24, 2025
HYD: సిటీ కుర్రాళ్ల కొత్త ట్రెండ్..!

భాగ్యనగరంలో కేఫ్ కల్చర్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. కేవలం కాఫీ, కబుర్లకే పరిమితం కాకుండా ‘పికిల్ బాల్’ వంటి క్రీడలతో యువత కేఫ్‌లల్లో సందడి చేస్తోంది. ఫ్రెంచ్, ఈజిప్షియన్ థీమ్స్‌తో సరికొత్త లోకాలను తలపిస్తున్న ఈ ప్రాంతాలు జెన్-జీ కుర్రాళ్లకు అడ్డాగా మారాయి. మరోవైపు ‘DIY’ ఫ్యాషన్‌తో పాత చికంకారీ వస్త్రాలకు స్ట్రీట్ వేర్ టచ్ ఇచ్చి ఫ్లీ మార్కెట్లలో సందడి చేస్తున్నారు.
News December 24, 2025
మరో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి HMDA సిద్ధం

మరో గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు HMDA సిద్ధమవుతోంది ORR నుంచి ప్రాంతీయ రోడ్లకు అనుసంధానం చేసేలా వీటిని రూపొందిస్తున్నారు. బుద్వేల్ నుంచి 165 రహదారి వద్ద కోస్గి వరకు ఈ రహదారి నిర్మించనున్నారు. దీనికి సంబంధించి డీపీఆర్ రూపొందించే పనిలోపడ్డారు. డీపీఆర్ పూర్తయిన అనంతరం ప్రభుత్వానికి ఈ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. 81 కి.మీ పొడవుతో, 4 లైన్లుగా రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.


