News September 6, 2024
HYD: పకడ్బందీగా ఓటరు జాబితా ప్రక్షాళన: సుదర్శన్‌రెడ్డి

బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న ప్రచురిస్తామని వెల్లడించారు. గురువారం బీఆర్కేఆర్ భవన్లో ఓటరు జాబితా ప్రక్షాళనపై రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News November 20, 2025
బంజారాహిల్స్ రోడ్డు విస్తరణపై హైకోర్టు ఆదేశం

బంజారాహిల్స్ విరించి ఆస్పత్రి నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణకు జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మద్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. భూసేకరణ చట్టం నిబంధనలను పాటించకుండా జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ విక్రమ్ దేవ్‌తో సహా 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
News November 20, 2025
మాజీ సైనికులకు గుడ్ న్యూస్.. 28న జాబ్ మేళా

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికోద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు ఈ మేళా ఉంటుందన్నారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారి హరినాయక్ తెలిపారు. ఆసక్తిగల వారు www.dgrindia.gov.inలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 20, 2025
మరోసారి అతిరథ మహారథులతో మెరిసిపోనున్న నగరం

భారతీయ కళా మహోత్సవం సెకండ్ ఎడిషన్‌కు రాష్ట్రపతి నిలయం వేదికకానుంది. 22- 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవ్‌లో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవాలతో పాటు డామన్& డయ్యూ, దాద్రానగర్ హవేలీకి చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు HYD రానున్నారు. కాగా, రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.


