News March 29, 2024

HYD: పకడ్బందీగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ: కమిషనర్

image

పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ సంబంధిత అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ హాల్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారులు, ఏఆర్‌ఓలకు పోస్టల్‌ బ్యాలెట్‌పై శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News November 16, 2025

HYD: మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి!

image

మీ మొబైల్ పోయిందా? అశ్రద్ధ చేయకండి. వెంటనే CEIR పోర్టల్ ద్వారా మీ మొబైల్ వివరాలు నమోదు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్లో అందించండి. పోలీసులు మీ మొబైల్ వెతికి మీకు అందిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 అక్టోబర్ 16 వరకు పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 84,003 ఫోన్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గుర్తించినవి 45,261 కాగా.. అందజేసినవి 14,965 ఉన్నట్లు పేర్కొన్నారు.

News November 16, 2025

రాజస్థాన్ కొత్త CSగా ఓయూ ఓల్డ్ స్టూడెంట్

image

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. 1987లో బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్), ఆ తరువాత ఎంటెక్ పూర్తిచేసిన శ్రీనివాస్ సివిల్స్‌లో విజయం సాధించి ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. అనేక పదవుల్లో పనిచేసిన ఆయన తాజాగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈనెల 17న శ్రీనివాస్ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.

News November 16, 2025

రాష్ట్రపతి నిలయంలో వేడుకలు.. ఉచితంగా పాసులు

image

ఈనెల 21 నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో కనువిందు చేయనున్నారు. 10 రోజుల పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. వీటిని చూడాలనుకున్న వారికి రాష్ట్రపతి నిలయం ఉచితంగా పాసులు అందజేస్తోంది. ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.
LINK: https://visit.rashtrapatibhavan.gov.in/plan-visit/rashtrapati-nilayam-hyderabad/p2/p2