News March 29, 2024
HYD: పకడ్బందీగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ: కమిషనర్

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ సంబంధిత అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు, ఏఆర్‌ఓలకు పోస్టల్ బ్యాలెట్‌పై శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అధికారులకు సూచనలు చేశారు.
Similar News
News July 6, 2025
HYD: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? జాగ్రత్త.!

సెకండ్ హ్యాండ్‌లో సెల్ ఫోన్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు. కొందరు దొంగిలించిన మొబైళ్లను దుకాణాల్లో అమ్ముతున్నారని తెలిసిందన్నారు. ఇటీవల వనస్థలిపురంలో సెకండ్ హ్యాండ్‌లో ఫోన్ కొని సిమ్ కార్డు వేసిన వెంటనే పోలీసులు పట్టుకున్నారు. దొంగిలించిన ఫోన్ తనకు అమ్మారని తెలుసుకున్న బాధితుడు తల పట్టుకున్నాడు. ఇటువంటి విషయంతో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.
News July 5, 2025
BREAKING: HYD: వికారాబాద్ విహారయాత్రలో మహిళలు మృతి

HYD నుంచి విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు మహిళలు శనివారం మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ మండలం సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలోని వెల్డర్‌నెస్ రిసార్ట్‌కు HYDకు చెందిన రీటా కుమారి(55), పూనమ్ సింగ్(56) వచ్చారు. విహారయాత్రలో భాగంగా ఈరోజు సా.5 గంటలకు ప్రాజెక్టులో బోటింగ్ చేస్తుండగా బోట్ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాదంలో వారిద్దరూ చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News July 5, 2025
HYD: గేటెడ్ కమ్యూనిటీల్లో ఇబ్బందులు.. GHMC ఆదేశాలు

HYDలో గేటెడ్ కమ్యూనిటీల్లో పోస్టుమాన్‌లకు ప్రవేశం, లిఫ్ట్ అనుమతి, పార్కింగ్ లేకపోవడంతో డెలివరీలకు ఇబ్బందులు తప్పటం లేదు. పోస్ట్‌మాస్టర్ జనరల్ ఫిర్యాదుపై జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులు, RWAలు సహకరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. లిఫ్ట్ వినియోగం, పార్కింగ్, లెటర్‌బాక్స్ ఏర్పాటు తప్పనిసరి అని పేర్కొంది. అంతేకాక.. నివాసితులు ప్రతినిధులను నియమించాలని సూచించింది.