News December 15, 2024

HYD: పటేల్ చిత్రపటానికి బీజేపీ కార్యాలయంలో నివాళులు

image

‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభాయి పటేల్ వర్ధంతి సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఇతర ప్రముఖ నాయకులతో కలిసి పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన జీవిత చరిత్ర ఎంతోమంది రాజకీయ నాయకులకు మార్గదర్శమని అన్నారు.

Similar News

News November 16, 2025

రాష్ట్రపతి హైదరాబాద్ టూర్.. షెడ్యూల్ ఇదే!

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ పర్యటన షెడ్యూలు ఖరారైంది. ఈనెల 21వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. 21న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొని రాజ్ భవన్‌కు వెళతారు. ఆ తరువాత మధ్యాహ్నం 3.50 గంటలకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళామహోత్సవాన్ని ప్రారంభిస్తారు. మరుసటి రోజు ఉదయం పుట్టపర్తికి వెళతారు.

News November 16, 2025

HYD: మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి!

image

మీ మొబైల్ పోయిందా? అశ్రద్ధ చేయకండి. వెంటనే CEIR పోర్టల్ ద్వారా మీ మొబైల్ వివరాలు నమోదు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్లో అందించండి. పోలీసులు మీ మొబైల్ వెతికి మీకు అందిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 అక్టోబర్ 16 వరకు పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 84,003 ఫోన్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గుర్తించినవి 45,261 కాగా.. అందజేసినవి 14,965 ఉన్నట్లు పేర్కొన్నారు.

News November 16, 2025

రాజస్థాన్ కొత్త CSగా ఓయూ ఓల్డ్ స్టూడెంట్

image

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. 1987లో బీటెక్ (కెమికల్ ఇంజినీరింగ్), ఆ తరువాత ఎంటెక్ పూర్తిచేసిన శ్రీనివాస్ సివిల్స్‌లో విజయం సాధించి ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. అనేక పదవుల్లో పనిచేసిన ఆయన తాజాగా రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈనెల 17న శ్రీనివాస్ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.