News February 24, 2025

HYD: పదో తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

image

పదో తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి డిప్లొమా పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందుకోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు.

Similar News

News November 8, 2025

HYD: ముఖ్యమంత్రి ప్రజావాణిలో 285 దరఖాస్తులు

image

బేగంపేటలోని ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణిలో మొత్తం 285 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 154, రెవెన్యూకు 25, హోం శాఖకు 17, ఇందిరమ్మ ఇళ్ల కోసం 59, ప్రవాసి ప్రజావాణికి 1 దరఖాస్తు, ఇతర శాఖలకు సంబంధించి 29 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జ్ జీ.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌ వెల్లడించారు.

News November 7, 2025

జూబ్లీ ఉపఎన్నిక.. రూ.3.33 కోట్ల నగదు సీజ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు నగదు, 701 లీటర్ల మద్యం, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు వంటి ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌ 7వ తేదీ ఉదయం వరకు మొత్తం 24 మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛా యుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు కఠిన నిఘా కొనసాగిస్తున్నాయి.

News November 7, 2025

HYD: ట్రబుల్ షూటర్ వచ్చేస్తున్నారు!

image

పితృవియోగంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు మళ్లీ యుద్ధరంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు దగ్గర పడుతుండడంతో, ట్రబుల్ షూటర్‌గా ఆయన ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. BRS జైత్రయాత్రను జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెట్టేందుకు, హరీశ్ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.