News June 23, 2024

HYD: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

జూన్ 24 నుంచి 29 తేదీల మధ్య జరిగే వసతి గృహ సంక్షేమాధికారి, జూన్ 30 నుంచి జులై 4 వరకు నిర్వహించే డివిజనల్ అకౌంట్స్ అధికారి నియామక పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. అందరూ ఈ విషయాన్ని గమనించాలని, నిబంధనలు పాలించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Similar News

News November 15, 2024

HYD: ఓపెన్ డిగ్రీ, PG చేయాలనుకునేవారికి నేడు లాస్ట్ ఛాన్స్!

image

డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 15 వరకు అవకాశం ఉందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వర్సిటీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, అంతకు ముందు వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం శుక్రవారం www.braou.ac.in ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT

News November 14, 2024

HYD: మీకు చికెన్, మటన్ షాప్ ఉందా..? జాగ్రత్త..!

image

HYDలో వేలాదిగా చికెన్, మటన్ షాపులు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. చికెన్ కట్ చేసే సమయంలో ఈగలు వాలటం, అపరిశుభ్రత కారణంగా పలువురు అస్వస్థత గురయ్యారు. దీనిపై జీహెచ్ఎంసీ వెటర్నరీ, హెల్త్ అధికారులు తనిఖీలు చేసి జరిమానా విధించారు. షాప్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 14, 2024

TET & DSC అభ్యర్థులకు ఫ్రీ గ్రాండ్ టెస్టుల నిర్వహణ

image

తెలుగు రాష్ట్రాల్లో TET & DSC అభ్యర్థులకు అద్భుత అవకాశం. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ హైదరాబాద్‌ వారు నవంబరు 17 నుంచి ప్రతి ఆదివారం జిల్లాల వారీగా మొబైల్ యాప్‌లో ఫ్రీ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు తమ జిల్లాల వారీగా మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సంస్థ అధినేత సిరికొండ లక్ష్మినారాయణ సూచించారు.