News June 9, 2024

HYD: పరీక్ష రాయనున్న 1,65,988 మంది అభ్యర్థులు

image

గ్రేటర్ HYD పరిధిలో నేడు జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 1,65,988 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకు 275 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 నుంచి మ.1 గంట వరకు పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉ.9 గంటల లోపు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.10 గంటల వరకు అనుమతించి బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారన్నారు. ఆ తర్వాత గేట్లు మూసివేసి అభ్యర్థులను అనుమతించరని పేర్కొన్నారు.

Similar News

News October 5, 2024

శేరిలింగంపల్లి: దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

దసరా సందర్భంగా HCU ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు హెచ్‌సీయూ డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక బస్సులను ఈ నెల 12వ వరకు నడుపుతామన్నారు. లింగంపల్లి నుంచి MGBS వరకు, గచ్చిబౌలి నుంచి మహబూబ్ నగర్ వైపు, లింగంపల్లి నుంచి జహీరాబాద్ వైపు బస్సులు ఉంటాయని వివరించారు. వివరాలకు ఫోన్ నంబర్ 7382814235ను సంప్రదించాలని సూచించారు.

News October 5, 2024

HYD: భారత్-బంగ్లా టీ20 మ్యాచ్.. నేడు టికెట్ల విక్రయం ప్రారంభం!

image

భారత్-బంగ్లా మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈ నెల 12న ఉప్పల్‌లో జరగనుంది. మ్యాచ్ టికెట్లు ఈ రోజు నుంచి విక్రయించనున్నట్లు HCA అధ్యక్షుడు జగన్మోహన్ తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పేటీఎంలో టికెట్లను విక్రయించనున్నట్లు చెప్పారు. టికెట్ ప్రారంభ ధర రూ.750 నుంచి రూ.15 వేలు ఉందన్నారు. ఆన్లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు జింఖానా స్టేడియంలో రిడంప్షన్ చేసుకోవాలన్నారు.

News October 4, 2024

HYDలో T20 మ్యాచ్.. భారీ బందోబస్తు

image

ఈ నెల 12న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్ VS బంగ్లాదేశ్ మధ్య T20-2024 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను రాచకొండ CP సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం DCPలు, ACPలు, HCA ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌తో సమావేశం నిర్వహించారు. క్రికెట్ అభిమానులకు అసౌకర్యం కలగవద్దని, T20 మ్యాచ్ నిర్వహణకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు CP సుధీర్ బాబు వెల్లడించారు.