News July 2, 2024
HYD: పరీక్ష ల్యాబ్ లా నూతన భవనం ప్రారంభం
రాజేంద్రనగర్లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి రూ.790 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మట్టి, విత్తనాలు ఫర్టిలైజర్ పరీక్ష ల్యాబ్ లా నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈరోజు ప్రారంభించారు. రైతులందరూ పంటలు నష్టపోకుండా అధిక దిగుబడి సాధించేందుకు, తమ భూముల సారవంతం తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు, రైతులు వాడే విత్తనాల నాణ్యతను పరీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
Similar News
News December 21, 2024
HYD: శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ చికిత్సకు స్పందిస్తున్నాడు. వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉండగా.. అప్పుడప్పుడు జ్వరం వస్తోంది. నాడీ వ్యవస్థ ప్రస్తుతానికి స్థిరంగా పనిచేస్తుందని.. నిన్నటి కంటే ఈరోజు శ్రీతేజ ఆరోగ్యం మెరుగైందని శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
News December 21, 2024
HYD: నేడు ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు
ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సాయంత్రం క్రిస్మస్ వేడుకలను నిర్వహించనుంది. ఈ క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకాన్నారు. ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News December 21, 2024
రాష్ట్రపతి నిలయానికి వారికి స్పెషల్ ఎంట్రీ
రాష్ట్రపతి నిలయం సందర్శనకు వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశం కల్పించనున్నారు. పిక్నిక్ స్పాట్లా ఉండేలా పిల్లలకు ప్లే ఏరియా, ఉద్యాన ఉత్సవాన్ని తిలకించేందుకు వసతి గృహాల విద్యార్థులను రాష్ట్రపతి నిలయానికి తీసుకువచ్చి ఆహ్లాదకర వాతావరణంలో జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన తాగునీరు, అంబులెన్స్, మొబైల్ టాయిలెట్లు, రవాణా, లైటింగ్ వంటి మౌళిక వసతులు కల్పిస్తున్నారు.