News April 2, 2025

HYD: పల్లె నుంచి పట్నంకు తాటి ముంజలు

image

నగరవాసుల వేసవి తాపాన్ని తీర్చేందుకు తాటిముంజలు‌ వచ్చేశాయి. ముషీరాబాద్‌, రాంనగర్ డౌన్, బయోలజికల్ ఈ లిమిటెడ్, అడిక్‌మెట్ ఫ్లై ఓవర్‌ తదితర ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరందుకుంది. డజన్ మంజలు రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. ఇవి తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. వడదెబ్బ తాకిన వారు వీటిని తింటే వెంటనే కోలుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధతో ధరలు ఎక్కువున్నా HYD వాసులు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.

Similar News

News November 27, 2025

పాలకమండలి లేకపోవడం వల్లే ‘విలీనం’ ఈజీ

image

గ్రేటర్‌లో కలువనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం ఎటువంటి పాలక మండలి లేదు. సంవత్సరం క్రితమే పాలక మండళ్ల గడువు ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్లే పరిపాలన చేస్తున్నారు. విలీనాన్ని అడ్డుకునేందుకు గానీ, ప్రశ్నించేందుకు గానీ సభ్యులు ఎవరూ ఉండరు. అందుకే సర్కారు ఈ సమయం చూసి ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను విలీనం చేసినపుడు కూడా అదే పరిస్థితి.

News November 27, 2025

HYD: విషాదం..11 ఏళ్లకే సూసైడ్

image

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన వెలుగుచూసింది. సుభాష్‌నగర్‌లో నివాసం ఉండే బాలుడు(11) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. సూసైడ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చిన్న వయసులో బాలుడి కఠిన నిర్ణయం స్థానికులను కలచివేసింది.

News November 27, 2025

HYD: FREE‌గా వెళ్లొద్దాం రండి!

image

HYD పరిధి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. నవంబర్ 30 వరకు ఉ.10 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందని HYD టూరిజం తెలిపింది. ఉచితంగా రాష్ట్రపతి నిలయం, వివిధ రకాల, కళలు వీక్షించే అవకాశం ఉంది. సా.7:00 వరకు లాస్ట్ ఎంట్రీగా పేర్కొన్నారు. QR కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.