News November 18, 2024

HYD: పసిబిడ్డకు మహిళా కానిస్టేబుల్ ఆలన

image

VKB జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం గ్రూప్-3 పరీక్ష రాసేందుకు HYDలోని శేరిలింగంపల్లికి చెందిన కృష్ణవేణి వెళ్లారు. ఆమెకు 6 నెలల బాబు ఉన్నాడు. దీంతో విధులు నిర్వర్తిస్తున్న బషీరాబాద్ PS మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ బాబును చేరదీసి, తల్లి పరీక్ష రాసి వచ్చేంతవరకు జాగ్రత్తగా చూసుకున్నారు. తోటి ఉద్యోగులు, ఇతరులు ఆమె దాతృత్వానికి అభినందించారు.

Similar News

News December 22, 2025

రాజేంద్రనగర్: ఫుడ్ పాయిజన్ వార్తల్లో వాస్తవం లేదు: గోవర్ధన్

image

రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చీఫ్ వార్డెన్ డాక్టర్ గోవర్ధన్ తెలిపారు. శనివారం బి- హాస్టల్లో, హాస్టల్ డే నిర్వహించారని, అందులో కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా తినడంతో అజీర్తి అయిందన్నారు. వారికి చికిత్స అందించారు అంతకుమించి ఎలాంటి ఇబ్బంది లేదని, విద్యార్థులు అందరూ సురక్షితంగా ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దన్నారు.

News December 22, 2025

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్

image

హైదరాబాద్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. 40 మంది యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన యూనివర్సిటీ సిబ్బంది వైద్య చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రుల్లో తరలించారు. ఆహారం కలుషితం కావడంతో(డీ హైడ్రేషన్) వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 22, 2025

రంగారెడ్డి జిల్లా రిటైర్డ్ DMHOపై ఫిర్యాదు

image

వనస్థలిపురం PS పరిధిలోని హస్తినాపురంలో ఉన్న అరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరును అక్రమంగా, ఆరుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చారని రంగారెడ్డి జిల్లా రిటైర్డ్ DMHO, ప్రస్తుత DEMOపై ఆరోపణలు వచ్చాయి. గతంలో అదే హాస్పిటల్‌కు MDగా పనిచేసిన Dr.దేవేందర్ RR కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఈమేరకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్‌పై ఎన్నో కేసులు ఉన్నా.. పేరు ఎలా మారిందని ప్రశ్నించారు.