News November 18, 2024
HYD: పసిబిడ్డకు మహిళా కానిస్టేబుల్ ఆలన
VKB జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం గ్రూప్-3 పరీక్ష రాసేందుకు HYDలోని శేరిలింగంపల్లికి చెందిన కృష్ణవేణి వెళ్లారు. ఆమెకు 6 నెలల బాబు ఉన్నాడు. దీంతో విధులు నిర్వర్తిస్తున్న బషీరాబాద్ PS మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ బాబును చేరదీసి, తల్లి పరీక్ష రాసి వచ్చేంతవరకు జాగ్రత్తగా చూసుకున్నారు. తోటి ఉద్యోగులు, ఇతరులు ఆమె దాతృత్వానికి అభినందించారు.
Similar News
News December 2, 2024
HYD: మాజీ సీఎంకు స్పీకర్ నివాళులు
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ఇందిరాపార్క్ స్మారక స్థూపం వద్ద తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.
News December 2, 2024
ఓయూలో ఈనెల 11 నుంచి పరీక్షలు
ఓయూ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఓయూ పరిధిలో వివిధ డిగ్రీ కోర్సుల ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతాయన్నారు.
News December 2, 2024
HYD: సికింద్రాబాద్ పేరు ఎలా వచ్చిందో..తెలుసా.?
HYDలోని ప్రస్తుత సికింద్రాబాద్ ప్రాంతాన్ని అప్పట్లో లష్కర్ అని పిలిచేవారు. లష్కర్ అనే పదానికి అర్థం ఆర్మీ క్యాంప్. అప్పట్లో ఈ ప్రాంతంలో బ్రిటిష్ ఆర్మీ ఈ ప్రాంతంలో ఉండేవారు. మూడో నిజాం ‘సికిందర్ జా’ పేరు మీద 1806లో లష్కర్ ప్రాంతాన్ని ‘సికింద్రాబాద్’ ప్రాంతంగా పేరు మార్చారని చరిత్ర చెబుతోందని చరిత్రకారులు మురళి తెలిపారు.