News February 13, 2025
HYD: పాఠాలు చెబుతూ.. అనుకున్నది సాధించా: SI

మొయినాబాద్ SI (ప్రొబేషన్)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జబీనా బేగం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మక్త వెంకటాపూర్లోని ఓ పేద కుటుంబంలో పుట్టారు. పాఠాలు చెబుతూ పేదరికం అనే అడ్డు గోడలను దాటి అనుకున్నది సాధించారు. ‘నా విజయం.. నా స్నేహితులు వారి సహకారం, ప్రోత్సాహంతో సాధ్యమైంది’ అని పేర్కొన్నారు. ఆమె చెల్లెలు కూడా కానిస్టేబుల్గా ఎంపికయ్యారని వివరించారు.
Similar News
News November 16, 2025
HYD: గోల్డెన్ అవర్ మిస్ అయితే గండమే!

ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను గోల్డెన్ హవర్ అని అంటాం. ప్రమాదం జరిగిన గంటలోపు క్షతగాత్రుడికి వైద్యం అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశం 90శాతానికిపైగా ఉంటుందని HYD డా.రవి ప్రకాష్ తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ జరిగిన సమయంలో తొలి 4 గంటలలోపు గోల్డెన్ అవర్గా భావిస్తారు. అయితే తొలి గంటలో వైద్యం 30% మందికి అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. SAVE THE LIFE
News November 16, 2025
HYD: ORR, హైవేలపైనే అధిక యాక్సిడెంట్స్!

గ్రేటర్ HYD అవుటర్ రింగ్ రోడ్డు (ORR), దాని చుట్టూ ఉన్న జాతీయ రహదారులపై ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 52% ప్రమాద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అధికవేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాత్రి వేళల్లో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వంటి కారణాలు ప్రధానంగా గుర్తించారు.
News November 16, 2025
రేపు నూజివీడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నూజివీడు పట్టణ పరిధిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ..రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చు అన్నారు. ప్రతి అర్జీ ఆన్లైన్ చేయడం, నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు.


