News February 13, 2025

HYD: పాఠాలు చెబుతూ.. అనుకున్నది సాధించా: SI

image

మొయినాబాద్‌ SI (ప్రొబేషన్)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జబీనా బేగం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మక్త వెంకటాపూర్‌లోని ఓ పేద కుటుంబంలో పుట్టారు. పాఠాలు చెబుతూ పేదరికం అనే అడ్డు గోడలను దాటి అనుకున్నది సాధించారు. ‘నా విజయం.. నా స్నేహితులు వారి సహకారం, ప్రోత్సాహంతో సాధ్యమైంది’ అని పేర్కొన్నారు. ఆమె చెల్లెలు కూడా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారని వివరించారు.

Similar News

News October 16, 2025

చిత్తూరు జిల్లాలో సోషల్ ఆడిట్ పూర్తి

image

చిత్తూరు జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక సోషల్ ఆడిట్ పూర్తయింది. 58 పాఠశాలలు తనిఖీ చేసి ఆడిట్ రిపోర్ట్ అందజేశారు. కన్నన్ కళాశాలలో జరిగిన హెచ్ఎంల సమావేశంలో ఆడిట్ రిపోర్ట్ అందజేశారు. ఆడిట్ రిపోర్టును 11 మంది రిసోర్స్ పర్సన్స్ పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం, పాఠశాల రికార్డులు తనిఖీ చేశారు. సమగ్ర శిక్ష ఏవో నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు.

News October 16, 2025

రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధం: రోహత్గీ

image

‘ఓటుకు నోటు’ కేసులో నిందితులు రేవంత్, సండ్ర వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది రోహత్గీ పేర్కొన్నారు. FIR నమోదవ్వకముందే ఉచ్చు పన్ని కేసు పెట్టడం అన్యాయమన్నారు. ACB సెక్షన్ల ప్రకారం లంచం తీసుకోవడం మాత్రమే నేరమని వాదించారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. రేపు కూడా విచారణ కొనసాగనుంది.

News October 16, 2025

మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారు: బన్నీ వాసు

image

టికెటింగ్ సంస్థ బుక్ మై షో సంస్థపై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు అసహనం వ్యక్తం చేశారు. వారి యాప్, సైట్‌లో సినిమాలకు అసలు రేటింగ్స్ ఎందుకని ప్రశ్నించారు. ‘జర్నలిస్టులు నిర్మాణాత్మక రివ్యూలు ఇస్తున్నారు కదా. మరి మీ రేటింగ్స్‌తో పనేముంది. అసలు సినిమా టికెట్ కొనే సమయంలో ఈ మూవీ బాగుంది, ఇది బాలేదు అని రేటింగ్ ఇవ్వడమేంటి? మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారని గుర్తు పెట్టుకోండి’ అని తెలిపారు.