News January 26, 2025
HYD: పాతబస్తీ మెట్రో.. రూ.80 కోట్ల చెక్కులు!

HYD పాతబస్తీ మెట్రోపై ఎండీ NVS రెడ్డి కీలక అప్డేట్ అందించారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణ కోసం 1100 నిర్మాణాలను తొలగించాల్సి ఉందని, ఇందులో 270 మంది స్వచ్ఛందంగా ఆస్తి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, వీరిలో మొత్తం 170 మందికి పరిహారం కింద ఇప్పటికే రూ.80 కోట్ల చెక్కులను పంపిణీ చేసినట్లుగా వెల్లడించారు. కేంద్రం అనుమతి రాగానే మెట్రో రెండో దశ ప్రారంభిస్తామన్నారు.
Similar News
News October 26, 2025
నేడు HYDలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

HYDలో ఆకాశం మేఘావృతమై ఉంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ‘నేడు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉదయం పొగమంచు పరిస్థితులు కనిపించొచ్చు. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 22°Cగా నమోదయ్యే అవకాశం ఉంది’ అని పేర్కొంది.
News October 26, 2025
నెత్తురోడుతున్న ‘సికింద్రాబాద్’ రైల్వే పట్టాలు

సికింద్రాబాద్ పరిధిలో రైల్వే పట్టాలు నెత్తురోడుతున్నాయి. SEC రైల్వే పోలీస్ జిల్లా పరిధిలో 2025లో OCT 20 నాటికి సుమారు 500 ప్రమాదాలు జరగగా, 400 వరకు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలకు శోకం మిగల్చొద్దని RPF టీం సూచించింది.
News October 25, 2025
కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్పై BRS ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. బీఆర్ఎస్ నాయకులపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ దుష్ప్రచారం చేసిందని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఫేక్ పోస్టులు, తప్పుదారి పట్టించే వీడియోలు, ఎడిట్ చేసిన ఫొటోలతో తమ మీద బురద జల్లుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


