News January 26, 2025

HYD: పాతబస్తీ మెట్రో.. రూ.80 కోట్ల చెక్కులు!

image

HYD పాతబస్తీ మెట్రోపై ఎండీ NVS రెడ్డి కీలక అప్డేట్ అందించారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణ కోసం 1100 నిర్మాణాలను తొలగించాల్సి ఉందని, ఇందులో 270 మంది స్వచ్ఛందంగా ఆస్తి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, వీరిలో మొత్తం 170 మందికి పరిహారం కింద ఇప్పటికే రూ.80 కోట్ల చెక్కులను పంపిణీ చేసినట్లుగా వెల్లడించారు. కేంద్రం అనుమతి రాగానే మెట్రో రెండో దశ ప్రారంభిస్తామన్నారు.

Similar News

News February 23, 2026

33 గంటల ట్రాఫిక్ జామ్.. రూ.5.16 కోట్ల టోల్ రిఫండ్

image

ఈ నెల 3న ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో 33 గంటలు <<19056410>>ట్రాఫిక్ జామ్<<>> అయిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర ఇబ్బందులు పడిన దాదాపు లక్ష మంది వాహనదారులకు రూ.5.16 కోట్ల టోల్‌ను రిఫండ్ చేయనున్నట్లు మహారాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది. కొన్ని రోజుల్లో ఫాస్టాగ్ అకౌంట్లకే జమ చేస్తామని తెలిపింది. ఆ ఘటన తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

News February 23, 2026

ఆర్ & బీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఆర్ & బీ శాఖ పనితీరుపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, నాన్‌ప్లాన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధులతో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఈ భావ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

News February 23, 2026

అనకాపల్లి: ఈనెల 28న మంత్రి లోకేశ్ రాక

image

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతంపాలెం గ్రామంలో ఈనెల 28వ తేదీన బ్లూ జెట్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వస్తున్నట్లు టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మంత్రి లోకేశ్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.