News April 3, 2025

HYD: పాత కూలర్లు, ఫ్రిడ్జ్, కుర్చీల కోసం ఇక్కడికి రండి!

image

పాత కూలర్లు, ఫ్రిడ్జ్, కుర్చీలు, CPU, కంప్యూటర్లు, బ్యాటరీలు తక్కువ ధరకు కొనాలనుకున్నవారు HYD అంబర్‌పేట్ పరేడ్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్‌కు రావాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలపారు. ఏప్రిల్ 4న ఉదయం 10:30 గంటలకు జరిగే వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.

Similar News

News April 8, 2025

CREDAI విశాఖ చాప్టర్ ఛైర్మన్‌గా ధర్మేందర్

image

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI) విశాఖ చాప్టర్ 2025-26 చైర్మన్ గా వి. ధర్మేందర్, అధ్యక్షుడిగా ఇ.అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా వి.శ్రీను ఎన్నికయ్యారు. కోశాధికారిగా కె.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కృషి చేస్తామని కార్యవర్గం ప్రకటించింది.‌ విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో CREDAI కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

News April 8, 2025

ముంబై పర్యటనకు కందుల దుర్గేశ్

image

AP: పర్యాటక శాఖలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేశ్ ఈ నెల 9, 10 తేదీల్లో ముంబైలో పర్యటించనున్నారు. పోవై లేక్‌లో జరిగే దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలు, రాయితీలు వంటివి వివరించి ఇన్వెస్టర్లను ఆహ్వానించనున్నారు. మంత్రితో పాటు పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి వెళ్లనున్నారు.

News April 8, 2025

గుడివాడ: మందుబాబులపై లోకేశ్ సెటైరికల్ పోస్ట్

image

గుడివాడలో ఇంజినీరింగ్ కాలేజీ వెనుక బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ కెమెరాలతో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. `పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది. సారీ గాయ్స్‌.. నేను మీకు ఎలాంటి హెల్ప్‌ చేయలేకపోతున్నా.. ఎందుకంటే ఏపీ పోలీసులు వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు’ అని X లో పోస్ట్ చేశారు.

error: Content is protected !!