News December 5, 2024

HYD: పాన్ కార్డు కరెక్షన్స్.. ఇది మీ కోసమే!

image

HYD అమీర్‌పేట స్వర్ణ భారతి కాంప్లెక్స్ భవనంలో CSC హెడ్ ఆఫీసులో పాన్ కార్డు, పాస్ పోర్టు సర్వీసులు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాన్ కార్డులో పేరు, DOB మార్పులు చేర్పులు కూడా చేస్తామన్నారు. మిగతా సర్వీసులు సైతం అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
SHARE IT

Similar News

News February 5, 2025

GHMC‌లో ఎలక్షన్స్.. నోటిఫికేషన్ విడుదల

image

GHMC‌లో స్టాండింగ్ కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనర్ ఇలంబర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ప్రస్తుత 146 మంది కార్పొరేటర్లలో 15 మంది సభ్యులను ఎన్నుకోవాలి. GHMC హెడ్ ఆఫీస్‌లో FEB 10 నుంచి 17 నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన పరిశీలన, తుదిజాబితా వెల్లడిస్తారు. 21న ఉపసంహరణ, 25న ఎన్నిక ఉంటుంది. అదే రోజు ఓటింగ్ ముగిశాక లెక్కింపు చేస్తారు. ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది.

News February 5, 2025

కూకట్‌పల్లిలో 8 మంది మహిళల బైండోవర్

image

కూకట్‌పల్లి PS పరిధిలోని భాగ్యనగర్ కాలనీ అల్లూరి ట్రేడ్ సెంటర్ వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది మహిళలను కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం అందడంతో వీరిని అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

News February 4, 2025

HYD: గన్ ప్రాక్టీస్.. కుక్కను చంపిన ప్రభాకర్!

image

HYD గచ్చిబౌలిలోని ప్రీజం పబ్‌లో పోలీసులపై కాల్పుల జరిపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గురించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. రూ. 10 లక్షలు పెట్టి 3 గన్‌లు, 500 బుల్లెట్లు కొన్న ప్రభాకర్.. ప్రాక్టీస్‌లో భాగంగా ఓ కుక్కను చంపినట్లు తెలుస్తోంది. బిజినెస్ అంటూ బిల్డప్ ఇస్తూ HYDలో మకాం వేశాడు. తాజాగా కాల్పులు జరిపి దొరికిపోయాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది.

error: Content is protected !!