News December 3, 2024

HYD: పాములు పట్టుకునే వారికోసం కాల్ చేయండి!

image

నగరంలో పలుచోట్ల పాములు కనిపించినప్పుడు ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. అలాంటి వారికి వెటర్నరీ అధికారులు శుభవార్త తెలిపారు. పాముల సంబంధిత ఫిర్యాదుల కోసం బోర్డు పై ఉన్న నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు చేస్తే వారు వచ్చి, పాములను పట్టుకుంటారని GHMC అధికారులు పేర్కొన్నారు.

Similar News

News January 26, 2025

సికింద్రాబాద్: 76వ గణతంత్ర దినోత్సవం.. ముస్తాబైన రైలు నిలయం

image

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం సుందరంగా వెలిగిపోయింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైలు నిలయం ముస్తాబైంది. హైదరాబాద్ డివిజనల్ కార్యాలయం మూడు రంగులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను మూడు రంగులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. అటు రైల్వే నిలయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ డివిజనల్ ఆఫీస్ మూడు రంగులతో ముస్తాబైంది. 

News January 25, 2025

HYDలో  ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అని చెప్పి ఫేక్ వాచ్‌లను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లో ఈ ముఠా అమ్మకాలు జరపగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6,037 వాచ్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 

News January 25, 2025

ఓయూలో వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.