News June 20, 2024
HYD: పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి: MRPS
రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. HYD విద్యానగర్‌లోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలన్నారు. కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News September 13, 2024
HYD: దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి, ఛాత్ పూజకు వెళ్లే ప్రయాణికులరద్దీని దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబరు 5 నుంచి నవంబరు 12 మధ్య ఒక్కో మార్గంలో ఆరేసి ట్రిప్పుల చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్, తిరుపతి-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-తిరుపతి మధ్య రైలు నడపనున్నట్లు తెలిపారు.
News September 12, 2024
హైదరాబాద్‌లో ఇరాన్ టూరిజం శాఖ రోడ్‌షో
భారత్-ఇరాన్ పర్యాటక సహకారమే లక్ష్యంగా ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో సాంస్కృతిక, చారిత్రక, సహజ వైవిధ్యాన్ని తెలిపేలా ఇరాన్ టూరిజం శాఖ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో గురువారం రోడ్‌షో నిర్వహించింది. ఇరాన్ టూరిజం ఉపమంత్రి అలీ అస్గర్ షాల్బాఫియాన్, తెలంగాణ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. జనవరి 2024 నుంచి భారతీయులకు ప్రతీ 6 నెలల్లో 15 రోజుల పాటు వీసా రహిత ప్రయాణాన్ని ఇరాన్ ప్రకటించింది.
News September 12, 2024
గణేశ్ నిమజ్జనం: HYDలో ‘రేపటి కోసం’
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండపాల్లో విగ్రహాలను నిలబెట్టిన భక్తులు ‘రేపటి కోసం’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ‘నిమజ్జనం ఉంది. విరాళాలు కావాలి. సొంత డబ్బులు పోగు చేయాలి. అన్నదానం కోసం దాతల సహాయం కావాలి. మన గణపతిని అంగరంగ వైభవంగా ఊరేగించాలి’ అన్న తపనతో యువత ముందుకు కదులుతున్నారు. మరి మీ మండపం వద్ద పరిస్థితి ఎలా ఉంది. కామెంట్ చేయండి.