News June 23, 2024
HYD: పార్కింగ్ సమస్య పరిష్కారానికి కృత్రిమ మేధ
హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాల్లో పార్కింగ్ సమస్యను పరిష్కరించడానికి కృత్రిమ మేధను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. HYDలోని సచివాలయంలో ఉన్న తన ఛాంబర్‌లో ‘ఈజీ పార్క్ ఏఐ’ సంస్థ డిజిటల్ ప్రెజెంటేషన్‌ను మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కింగ్ స్లాట్‌ను ముందే బుక్ చేసుకునేందుకు యాప్‌లను రూపొందించాలని పేర్కొన్నారు.
Similar News
News November 7, 2024
HYD: లక్షల్లో భవనాలు.. పదుల్లో ఫైర్ స్టేషన్లు..!
గ్రేటర్ HYDలో లక్షకు పైగా ఐదంతస్తుల కంటే ఎత్తు కలిగిన భవనాలు ఉన్నాయి. HYD, RR, MDCL జిల్లాల్లో చూస్తే అగ్నిమాపక కేంద్రాలు కేవలం 31 మాత్రమే ఉన్నాయి. దీని కారణంగా సరైన సమయానికి అగ్నిప్రమాదం జరిగిన చోటుకు వెళ్లలేకపోవడం, సరైన సిబ్బంది లేకపోవడంతో ప్రమాదాల స్థాయి పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News November 7, 2024
HYD: డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు: మంత్రి
డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. HYDలో నిర్వహించిన సమావేశంలో అధికారులతో ఆమె చర్చించారు. స్వయం సహాయక సంఘాల్లో ప్రతి మహిళను చేర్పించడమే లక్ష్యంగా ప్రోగ్రాం నిర్వహిస్తామని,పంచాయతీరాజ్, నిర్వహిస్తామని, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల సంస్థలు ఇందులో భాగమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
News November 7, 2024
HYD: డెడ్‌బాడీకి చికిత్స.. మెడికవర్ వైద్యుల క్లారిటీ
మాదాపూర్ మెడికవర్‌లో చికిత్స పొందుతూ మరణించిన జూ. డాక్టర్ నాగ ప్రియ (28) మృతిపై ఆస్పత్రి వైద్యులు వివరణ ఇచ్చారు. ఠాగూర్ సినిమాను తలపించేలా ఆస్పత్రిలో డెడ్ బాడీకి చికిత్స, బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మృతదేహాన్ని అప్పగించారంటూ వచ్చిన కథనాలను మెడికవర్ వైద్యులు, యాజమాన్యం ఖండించారు. అడ్మిట్‌కు ముందే పేషెంట్ పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, బతికించేందుకు తీవ్రంగా కృషి చేశామన్నారు.