News May 4, 2024
HYD: పార్లమెంట్ ఎన్నికలు.. పోలీసుల కవాతు..!

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం, ప్రజలకు మరింత భద్రత కల్పించడంలో ఇదొక భాగమని అన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్‌ల వద్ద పకడ్బందీ భద్రత చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
Similar News
News April 10, 2026
రూ.200 కోట్లతో మరో సైబర్ టవర్

ఐటీ హంగులకు ప్రతీకగా త్వరలో మరో అత్యాధునిక సైబర్ టవర్ నిర్మాణం కానుంది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కోసం కైత్లాపూర్‌లోని 5ఎకరాల స్థలంలో G+8 అంతస్తుల సమీకృత భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.200కోట్ల అంచనాతో నిర్మించనున్నారు. 3జోన్లు, 16సర్కిళ్ల పరిధిలోని ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించడమే లక్ష్యంగా ఈ భారీ భవన నమూనాను సిద్ధం చేస్తున్నారు.
News April 10, 2026
HYD: DGP ఎదుట లొంగిపోనున్న 30మంది మావోయిస్టులు

హైదరాబాద్‌లో ఈరోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుపోతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మ.3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోనుండగా, ఇందులో PLGA బెటాలియన్ సభ్యులు ఉన్నట్లు సమాచారం. లొంగుబాటుతో నక్సలిజం నిర్మూలనలో పోలీసులు మరో ముందడుగు వేశారు.
News April 10, 2026
HYD: రాజకీయ నేత కుమారుడి లైంగిక వేధింపులు.. బాలిక ఆత్మహత్య

హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. ఓ రాజకీయనేత కుమారుడి లైంగిక వేధింపులకు మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. విషయాన్ని బయటకు చెబితే కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. కూతురు మృతదేహాన్ని తీసుకొని సొంత గ్రామానికి బాధితులు వెళ్లిపోయారు. బాలిక మృతికి కారకులపై పోక్సో కేసు నమోదు చేయాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలి తండ్రి PSలో ఫిర్యాదు చేయడానికి వస్తున్నట్లు సమాచారం.


