News April 24, 2024
HYD: పాలు కొంటున్నారా..? జాగ్రత్త..!

HYD నగరంలో కల్తీ లేని పదార్థమే లేదన్నట్టుగా పరిస్థితి మారింది. HYD టాస్క్‌ఫోర్స్ పోలీసు బృందం చేపట్టిన తనిఖీల్లో హబీబ్‌నగర్ పరిధిలో పాలలో అమ్మోనియం సల్ఫేట్ రసాయనాన్ని కలిపి చిక్కగా ఉండేలా చేసి విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. చిక్కటి బర్రె పాలు పితికి వెంటనే అందిస్తున్నామని కవర్లలో విక్రయిస్తున్నారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాలు కొనేటప్పుడు జర జాగ్రత్త..!
Similar News
News December 16, 2025
HYD: దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? బుక్ చదివారా?

తాపీ ధర్మారావు రచించిన <<18569096>>ఈ పుస్తకం<<>> ఆలయ శిల్పాలపై ఉన్న అజ్ఞానం, ద్వంద్వ నైతికతను ప్రశ్నిస్తుంది. శృంగార శిల్పాలపై ఉన్న అసభ్య ముద్రను చెరిపేసి, వాటి వెనుక దాగిన సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక తాత్విక అర్థాలను స్పష్టంగా విశ్లేషిస్తుంది. కోరికల నియంత్రణ, జీవన సమగ్రత, ఆలయం వెలుపల- లోపల తాత్విక భావనను సంక్షిప్తంగా వివరిస్తుంది. ఖజురహో వంటి ఉదాహరణలతో చరిత్రను విశ్లేషించి, పాఠకుడిని ఆలోచింపజేస్తుంది.
News December 16, 2025
నెహ్రూ జూ పార్క్‌లో AI కమాండ్ కంట్రోల్ సెంటర్

నెహ్రూ జూ పార్క్ చరిత్రలో ఒక అద్భుతం జరగబోతోంది. త్వరలో AI కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అడవి బిడ్డల రక్షణలో ఇది సరికొత్త రికార్డు సృష్టించనుంది. AI సాయంతో జంతువుల ప్రతి కదలికను, వాటి ఆరోగ్యాన్ని 24/7 పర్యవేక్షించవచ్చు. ఏదైనా చిన్న మార్పు వచ్చినా ఈ స్మార్ట్ సెంటర్ వెంటనే హెచ్చరిస్తుంది. ప్రైవేట్ సౌండ్-ప్రూఫ్ టెక్నాలజీతో ఈ కేంద్రాన్ని నిర్మించడం విశేషం.
News December 16, 2025
10 నిమిషాల వీడియో కావాలా? HYDలో కొత్త దందా!

‘మీకు 10 నిమిషాల ఆ వీడియో కావాలా? జస్ట్ రూ.200. 30 నిమిషాల లైవ్ చాట్ రూ.300. 2 గంటల లైవ్ అశ్లీల వీడియో చాట్ రూ.500. కింద కనిపిస్తున్న అమ్మాయిల నంబర్లకు కాల్ చేయండి.’ అంటూ SMలో కొత్త దందా మొదలైంది. ముందుగా డబ్బులు పంపి, ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేయాలని కండీషన్ పెడుతారు. టెంప్ట్ అయ్యి ఆ పని చేయకండి. ఆ తరువాత వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని HYD పోలీసులు సూచించారు.


