News February 2, 2025
HYD: పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలి

పిల్లల కడుపులో నులిపురుగులు చేరితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. నులి పురుగుల వల్ల చిన్నారుల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. వీటికి నివారణగా వైద్యుల సూచనల మేరకు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు
Similar News
News February 12, 2025
ఏ సినిమాకు వెళ్తున్నారు?

ఈ వారం కొత్త సినిమాల కంటే పాత సినిమాల హవానే ఎక్కువగా ఉంది. వాలంటైన్స్ డే కావడంతో పలు సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. ఈనెల 14న విశ్వక్‌సేన్ ‘లైలా’, బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించిన ‘బ్రహ్మా ఆనందం’ రిలీజ్ కానున్నాయి. ఇక అదేరోజున రామ్ చరణ్ ‘ఆరెంజ్’, సూర్య ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’, సిద్ధూ జొన్నలగడ్డ ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ చిత్రం ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో రిలీజ్ కానున్నాయి.
News February 12, 2025
చికెన్ తినడంపై ప్రభుత్వం కీలక ప్రకటన

AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆయా గ్రామాల్లో ఒక KM ప్రాంతాన్ని అలర్ట్ జోన్‌గా ప్రకటించింది. 10KM పరిధిని సర్వైలన్స్ ప్రాంతంగా ప్రకటించి, కోళ్లు, ఉత్పత్తుల రాకపోకలను నిషేధించింది. అలర్ట్ జోన్ ప్రాంతంలో మినహా మిగతా చోట్ల ఉడకబెట్టిన గుడ్లు, మాంసం తీసుకోవచ్చని పశుసంవర్ధక శాఖ తెలిపింది. చికెన్ ప్రియులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.
News February 12, 2025
NZB: యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి

వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ రమేశ్ పేర్కొన్నారు.