News March 3, 2025

HYD: పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా..? జాగ్రత్త..!

image

సెల్ ఫోన్లలో నిరంతరం ఆటలు, వీడియోల్లో మునిగితేలుతూ, ల్యాప్ ట్యాప్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు చూసే పిల్లలకు వర్ణాంధత్వం వస్తున్నట్లుగా HYD-HCU ఆచార్యులు డాక్టర్ శివరాం నోట్ విడుదల చేసారు. దీన్ని గుర్తించడం కోసం ‘రిశివి’ సాఫ్ట్ వేర్ అనే యాప్ రూపొందించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంచాలని సూచించారు. వర్ణాంధత్వం వచ్చినవారు కొన్ని రంగులను గుర్తించలేరు.

Similar News

News November 1, 2025

టీమ్ఇండియా కప్ గెలిస్తే రూ.125కోట్లు!

image

WWC గెలిస్తే భారత క్రికెట్ జట్టుకు భారీ నజరానా ఇవ్వాలని BCCI భావిస్తున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. గతేడాది T20 WC గెలిచిన పురుషుల జట్టుకు రూ.125కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. మెన్స్ టీంతో సమానంగా మహిళల జట్టుకు కూడా నజరానా అందించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. రేపు ఫైనల్‌లో నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో హర్మన్ సేన పోటీపడనుంది. అటు ICC సుమారు రూ.123CR ప్రైజ్‌మనీ ఇస్తుంది.

News November 1, 2025

‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది’ అంటూ యాడ్!

image

పాన్ కార్డు, బర్త్, స్టడీ సర్టిఫికెట్స్ పోయాయని కొందరు పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటాం. అయితే అస్సాంలోని ఓ వార్తాపత్రికలో తన డెత్ సర్టిఫికెట్ పోయిందని యాడ్ రావడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. రంజిత్ చక్రవర్తి అనే వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ లంబ్డింగ్ బజార్‌లో పోయిందని ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు దీనిపై స్పందించకపోయినా, ఈ తప్పు ప్రకటన ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

News November 1, 2025

వరి పొలం గట్లపై కంది మొక్కల పెంపకంతో ఏమిటి లాభం?

image

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.